టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన శ్రియ శరన్ దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసి మెప్పించింది. శ్రియ తెలుగులో నాగార్జునతో చాలానే సినిమాలు చేసింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. నాగార్జున- శ్రియ ‘సంతోషం’, ‘నేనున్నాను‘, ‘ఊపిరి’, ‘మనం’ వంటి సినిమాల ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఈ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఇక శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సపోర్టింగ్ రోల్స్‌తో పాటు ప్రధాన పాత్రలో పలు సినిమాలు చేస్తుంది. పెళ్లి, కూతురుకు జన్మినిచ్చిన తర్వాత ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ తన అందచందాలతో మత్తెక్కిస్తుంది.ఇప్పటికీ కుర్ర భామలు కుళ్లుకునేలా ఈ భామ రచ్చ ఉందంటే ఎంతలా రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా శరణ్ నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘సౌత్ లో అద్భుతమైన నటులు ఉన్నారు. వారిలో నేను నాగార్జునతో కలిసి పనిచేశాను.’ ‘ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థమయ్యేలా నేర్పించారు అని తెలియజేసింది.
ధ్యానం వలన నేను నా జీవితంలో అన్ని పరిస్థితులని ఎదుర్కొనగలుగుతున్నాను అని శ్రియ పేర్కొంది. నా జీవితంలో నాగార్జున నాకు చేసిన గొప్ప సాయం ఇది అంటూ శ్రియ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే శ్రియ.. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన శ్రియ… మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో కూడా ఆడిపాడింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన శ్రియ తన పాత్రతో ఎంతో మెప్పించింది.