న్యూఢిల్లీ : టీవీకే (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్( Vijay) ప్రచార సభలో ఓ యువకుడు గన్(Gun)తో కనిపించడం కలకలం రేపింది. పుదుచ్చేరి(Puducherry rally)లోని ఉప్పలం మైదానంలో నిర్వహించిన సభకు విజయ్ హాజరయ్యారు. ఈ సభకు టీవీకే కార్యకర్త ఒకరు గన్ తో హాజరయ్యాడు. తనిఖీల్లో పోలీసులు యువకుడి వద్ద గన్ ను గుర్తించి అతడిని(TVK youth arrested with gun) అదుపులోకి తీసుకున్నారు. శివగంగ జిల్లా కార్యకర్తగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఈ సభకు కేవలం ఐదువేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ హాజరైన తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. కఠిన ఆంక్షలతో ఈ సభకు అనుమతినిచ్చారు. టీవీకే జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఉన్న కార్లకే ప్రవేశం కల్పించనున్నారు. ఇక 500 మందికి ఒక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్స్‌లు, ఇతర భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిందిరోడ్‌షోలో భద్రతాగా 1000 మంది పోలీసులు మోహరించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా హాజరుకావద్దని పార్టీ కోరింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భవనాలు, పైకప్పులు, చెట్లపైకి లేదా ట్రాన్స్‌ఫార్మర్‌లను ఎక్కడానికి దూరంగా ఉండాలని కోరింది. ఈ సభకు హాజరయ్యేందుకు విజయ్ నీళంకరై నుంచి పుదుచ్చేరిలోని ఉప్పలంకు చేరుకున్నారు. దారి వెంట విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
