TVK Vijay | విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల సింబల్ ‘విజిల్‌’

తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఎన్నికల గుర్తుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘విజిల్’ కేటాయించింది. తమిళనాడులో తొలి అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే సిద్ధమవుతోంది.

Vijay TVK Party Whistle Symbol

విధాత : తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎన్నికల గుర్తుగా ‘విజిల్‌’ ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. నటుడు విజయ్‌ నూతనంగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరపును అన్ని స్థానాల్లో అభ్యర్థులను దించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి సీఈసీ విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే కమల్ హాసన్ కు చెందిన ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

తమిళనాడులో టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్‌ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా విజయ్ ప్రకటించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆయన ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. అయితే కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట ఘటనతో విజయ్ దూకుడుకు కొంత బ్రేక్ పడింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కొనసాగిస్తుంది. విజయ్ ని సైతం సీబీఐ ప్రశ్నించింది. దీనిపై విజయ్ ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్‌ రిలీజ్‌ ఆగిపోయిన కూడా స్పందించలేదు.

ఇటీవలే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్‌ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అలాగే.. విజయ్‌ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. త్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Wireless Electricity Transmission | వైర్లు వాడకుండానే విద్యుత్‌ సరఫరా.. సాకారం చేసే దిశగా అడుగులు
NIMS Model District Hospitals | కార్పొరేట్‌ దోపిడికీ చెక్‌ పెట్టేలా నిమ్స్‌ తరహాలో జిల్లాకొక టిమ్స్‌!

Latest News