Garlic | చలికాలం( Winter ) రాగానే చాలా మంది తమ ఆహారపు అలవాట్లను( Food Habits ) మార్చేసుకుంటారు. ఈ కాలంలో శరీరంలో వేడిని పుట్టించే పదార్థాలను తీసుకుంటారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి( Immunity Power )ని పెంపొందించే పదార్థాలు తీసుకోవడం కూడా ముఖ్యమే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ చలికాలంలో వెల్లుల్లి( Garlic ) శరీరానికి ఒక వరం లాంటింది అని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. వెల్లుల్లి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. వివిధ వ్యాధుల నుంచి రక్షించడానికి ఒక ఔషధంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. మరి వెల్లుల్లి వల్ల కలిగే లాభాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు..
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. నిత్యం జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
గుండె ఆరోగ్యానికి..
గుండె సమస్యలతో బాధపడే వారికి కూడా వెల్లుల్లి ఒక వరం లాంటిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలంటే..?
ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను వలిచి రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని పొద్దున్నే పరగడుపున తాగితే బెటర్. లేదా ఆ రెబ్బలను నమిలి మింగాలి. కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడానికి ఈ పద్ధతి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున 1–2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా వెల్లుల్లిని తినడం మరిచిపోకండి.
