సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. బిల్కిస్‌ బానో రివ్యూ పిటిషన్‌ను కొట్టివేత..!

Bilkis Bano Case | 2002 గోద్రా అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందిని దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్‌ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలగా.. కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చిన విషయం […]

  • Publish Date - December 17, 2022 / 06:26 AM IST

Bilkis Bano Case | 2002 గోద్రా అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందిని దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్‌ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలగా.. కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వగా.. దీన్ని సవాల్‌ చేస్తూ బిల్కిన్‌ బానో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. ప్రభుత్వానికి ఆ అధికారం ఉందంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

గుజరాత్‌లో గోద్రా రైలు ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లలో నుంచి పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైన సమయంలో బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. అదే సమయంలో ఐదు నెలల గర్భిణి. చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కూతురు సైతం ఉన్నది. ముందస్తు విడుదలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలుపుతూ గుజరాత్ సర్కారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

Latest News