Site icon vidhaatha

Supreme Court | బిల్కిస్‌ బానో కేసులో ఆగస్ట్‌ 7న తుది విచారణ

Supreme Court

న్యూఢిల్లీ: గుజరాత్‌ మత ఘర్షణల సమయంలో బల్కిస్‌బానో గ్యాంగ్‌ రేప్‌, ఆమె కుటుంబంలో ఏడుగురి హత్య కేసులో 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తుది విచారణ ఆగస్ట్‌ 7వ తేదీ నుంచి మొదలు కానున్నది.

ఈ మేరకు తేదీని సుప్రీం కోర్టు సోమవారం నిర్ణయించింది. కేసు విచారణకు ముందు ప్రొసీడింగ్స్‌ ముగిశాయని, విడుదలైన దోషులందరికీ నోటీసులు కూడా వెళ్లాయని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది.

ఈ కేసులో బిల్కిస్‌ బానో తరఫున శోభాగుప్తా వాదిస్తుండగా.. ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసినవారి తరఫున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌, వీరేంద్ర గ్రోవర్‌ వాదించనున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరుకానున్నారు.

ఈ కేసులో ఏప్రిల్‌ 18న విచారించిన సుప్రీం కోర్టు.. 11 మంది దోషులను విడుదల చేసిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వారు చేసిన నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందని వ్యాఖ్యనించింది

Exit mobile version