Vidhaatha

Latest Telugu News

No election results available

ముఖ్యాంశాలు

తలపతి విజయ్​ డ్రైవర్​ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే!

డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్. విరుగంబక్కం నుంచి పోటీ చేసిన శబరీనాథన్ భారీ ఆధిక్యంతో గెలుపొందడం ఈ ఎన్నికల్లో భావోద్వేగ క్షణం..

విజయ్ శబరీనాథన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చుతున్న దృశ్యం

50 ఏళ్లలో కమ్యూనిస్టు ప్రభుత్వాల్లేని తొలి సందర్భం

2026 కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఓటమి.. వామపక్ష చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వాస్తవానికి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక రాష్ట్రంలో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఏర్పడింది నాటి కేరళ.. నేటి కేరళంలోనే. యాదృచ్ఛికం ఏమిటంటే.. ఇప్పుడు అదే కేరళను వామపక్షాలు కోల్పోవడం. 1977 తర్వాత దేశ రాజకీయ చిత్రపటంలో కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం లేని మొదటి సందర్భం ఇదే.

విజయ్ వదులుకోబోయే స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారా..?

అయితే టీవీకే అధినేత విజయ్ పోటి చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పులో కూడా గెలవడంతో వీటిలో ఒక స్థానాన్ని వదులుకోక తప్పదు. అతను వదులుకున్న స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో తాను వదులుకోబోయే స్థానంలో విజయ్ ఎవరిని నిలబెడతారన్న విషయం ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది.

మమత స్వయంకృతాపరాధాలు.. బీజేపీకి కలిసొచ్చాయా? బీఆరెస్‌తో పోలికేంటి?

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయిందని తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ వ్యవహారం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా నిర్బంధ కాండ ప్రయోగించిన మమత.. ఆ శూన్యతను బీజేపీ భర్తీ చేస్తుందనే సోయి కూడా లేకుండా వ్యవహరించడం వల్లే బీజేపీకి ఇప్పుడు అధికారం దక్కిందని పరిశీలకులు అంటున్నారు.

విజయ్‌ ఈల.. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల చెవుల్లో మోత..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది ఐదు దశాబ్దాలుగా అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే అనే సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు సినీ హీరో, టీవీకే అధినేత విజయ్‌. 111 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

త్రిష పేరు ట్రెండింగ్‌లోకి, సెలబ్రిటీల రియాక్షన్స్ వైరల్!

Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. నటుడు విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఊహించని విధంగా భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే 110కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించిన టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం దాదాపు లాంఛనంగా మారింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.