ఈ ఏడాది టాలీవుడ్‌లో మహామహులు కన్నుమూయడం చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పొచ్చు. కళా తపస్వీ కే విశ్వనాథ్‌తో పాటు గాయని వాణీ జయరాం, తారకరత్న, శరత్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు స్వర్గస్తులయ్యారు. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ నవంబర్ 11వ తేదీన హృదయ రోగ సమస్యతో మరణించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటీష్ పాలకుల సామ్రాజ్యాధిపతి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ ఈ యేడాది మే 22న కన్నుమూశారు . చనిపోయే నాటికీ ఈయన వయసు 58 యేళ్లు మాత్రమే. ఇక తన విలక్షణ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతూ.. మే 22న కన్నుమూశారు.
80, 90వ దశకాల్లో ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ అనారోగ్యంతో మే 21న తుదిశ్వాస విడిచారు. తమిళంలో పాటు తెలుగులో తన కామెడీతో ఆకట్టుకున్న మనోబాల మే 3న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. నటుడు కమ్ దర్శకుడు సతీష్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో మార్చి 9న చనిపోయారు. ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించి అలరించగా, ఆయన ఫిబ్రవరి 19న దివంగతులయ్యారు. ఇక నందమూరి హీరో తారకరత్న జనవరి 27న లోకేశ్ యువగళం పాత్రలో పాల్గొంటూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 17న కన్నుమూసారు. ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ .. తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఫిబ్రవరి 3న తుదిశ్వాస విడిచారు.
ఇక కళాతపస్వి కే విశ్వనాథ్ ఫిబ్రవరి 2న కన్నుమూశారు. అప్పటికీ విశ్వనాథ్ వయసు 92 ఏళ్లు. దర్శకుడు సాగర్.. రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేయగా ఆయన ఫిబ్రవరి 2న కన్నుమూసారు. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి చేరువైన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో జనవరి 27న కన్నుమూసారు.అలనాటి అందాల నటి జమున జనవరి 27న వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూసారు. ప్రముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్ రైటర్ బాలమురుగన్ (86) జనవరి 16న తుదిశ్వాస విడిచారు. వీరే కాకుండా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా పలు కారణాల వలన ఈ లోకాన్ని విడిచిపెట్టి వారి అభిమానులకి తీరని విషాదాన్ని మిగిల్చారు.