Site icon vidhaatha

ఈ ఏడాది ఎంత‌మంది క్రికెట్‌కి గుడ్ బై చెప్పారో తెలుసా..!

మ‌రి కొద్ది రోజుల‌లో 2023 ముగియ‌నుంది. ప్ర‌తి ఒక్క‌రు ఈ ఏడాదికి సంబంధించిన పాత జ్ఞాపకాలు నెమ‌ర‌వేసుకుంటున్నారు. క్రికెట్ ప‌రంగా చూస్తే ఈ ఏడాది భార‌త్‌కి చేదు జ్ఞాప‌క‌మ‌నే చెప్పాలి. సొంత గ‌డ్డ‌పై క‌ప్ కొడుతుంద‌ని అంద‌రు వేయి కళ్ల‌తో ఎదురు చూడ‌గా, ఫైన‌ల్‌లో నిరాశ‌ప‌ర‌చింది. ఆస్ట్రేలియా 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొందరు వన్డేలకు గుడ్‌ బై చెబితే, మరికొందరు టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోగా, ఇంకొంద‌రు అన్ని ఫార్మాట్స్ నుండి త‌ప్పుకున్నారు. వారి జాబితే చూస్తే.. ముందుగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ ప్రిటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ద‌క్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను అంతకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్ప‌గా,ఈ సంవత్సరం అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌ బై చెప్పేశాడు. 2007లో టీమిండియాను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపిన జోగిందర్ శర్మ కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఆసీస్‌కి చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ ఈ ఏడాదే క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. అయితే యాషెస్ ఆడేందుకు త‌న రిటైర్మెంట్‌ని వెన‌క్కి తీసుకున్న మొయిన్ ఆలీ యాషెస్ త‌ర్వాత మ‌ళ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

ఇక వ‌రల్డ్ క‌ప్ స‌మ‌యంలో కూడా కొంద‌రు ఆట‌గాళ్లు గుడ్ బై చెప్ప‌డం మనం చూశాం. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కేవలం 24 సంవత్సరాల వయస్సులో వన్డేల నుండి రిటైర్ అయ్యి అంద‌రికి పెద్ద షౄక్ ఇచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ కూడా ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావ‌డం మ‌నం చూశాం. క్రికెట్‌లో అత్య‌ద్భుత‌మైన ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌కి కాస్త ఇబ్బందిగా మారింది.

Exit mobile version