Inter
విధాత, హైద్రాబాద్ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువులు ఈనెల 31 వరకు పొడిగించారు.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రవేశాల గడువు మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు