Story of Titan submersible | టైటాన్ క‌థ విషాదాంతం?

Titan submersible  చారిత్ర‌క టైటానిక్ నౌక‌ను చూడ‌టానికి ప‌ర్యాట‌కుల‌తో ఆదివారం నాడు బ‌య‌లు దేరిన బుల్లి జ‌లాంత‌ర్గామి టైటాన్ క‌థ విషాదాంతం కాబోతోందా? యూఎస్ కోస్ట్‌గార్డ్ కొద్దిసేప‌టి క్రితం ఇచ్చిన స‌మాచారం దాన్నే ధృవ‌ప‌రుస్తోంది. టైటానిక్ స‌మీపంలో తాము కొన్ని శ‌క‌లాల‌ను గుర్తించిన‌ట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్ర‌క‌టించింది. ప్ర‌ఖ్యాత టైటానిక్ నౌక‌ను టూరిస్టుల‌కు చూపించడానికి బ‌య‌లుదేరిన ప‌ర్యాట‌క జ‌లాంత‌ర్గామి టైటాన్ గ‌ల్లంతైన‌ట్లు తెలిసిందే. అందులో ప్ర‌యాణిస్తున్న‌వారు మ‌ల్టీ బిలియ‌నీర్లు, టైటాన్ య‌జ‌మాని కూడా ఉన్నారు. దానితో సంబంధాలు […]

  • Publish Date - June 22, 2023 / 06:30 PM IST

Titan submersible చారిత్ర‌క టైటానిక్ నౌక‌ను చూడ‌టానికి ప‌ర్యాట‌కుల‌తో ఆదివారం నాడు బ‌య‌లు దేరిన బుల్లి జ‌లాంత‌ర్గామి టైటాన్ క‌థ విషాదాంతం కాబోతోందా? యూఎస్ కోస్ట్‌గార్డ్ కొద్దిసేప‌టి క్రితం ఇచ్చిన స‌మాచారం దాన్నే ధృవ‌ప‌రుస్తోంది. టైటానిక్ స‌మీపంలో తాము కొన్ని శ‌క‌లాల‌ను గుర్తించిన‌ట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్ర‌క‌టించింది.

ప్ర‌ఖ్యాత టైటానిక్ నౌక‌ను టూరిస్టుల‌కు చూపించడానికి బ‌య‌లుదేరిన ప‌ర్యాట‌క జ‌లాంత‌ర్గామి టైటాన్ గ‌ల్లంతైన‌ట్లు తెలిసిందే. అందులో ప్ర‌యాణిస్తున్న‌వారు మ‌ల్టీ బిలియ‌నీర్లు, టైటాన్ య‌జ‌మాని కూడా ఉన్నారు. దానితో సంబంధాలు తెగిపోయిన ద‌గ్గ‌ర్నుండి చేప‌ట్టిన విస్తృత గాలింపు చ‌ర్య‌లు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాగా, టైటాన్‌లో ఉన్న ఆక్సిజ‌న్ నేటి రాత్రి 7.15 గంట‌ల వ‌ర‌కే స‌రిపోతుంద‌ని అంచనా వేసారు. దాంతో ప్ర‌యాణీకుల కుటుంబాల‌లో ఆందోళ‌న తీవ్ర‌మైంది.

ఇంత‌తో ఓ పిడుగుపాటులాంటి వార్త‌ను అమెరికా కోస్ట్‌గార్డ్ ప్ర‌క‌టించింది. మునిగిపోయిన టైటానిక్ మ‌హానౌక స‌మీపంలో కొన్ని శ‌క‌లాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపింది. అయితే, అవి టైటాన్‌కు సంబంధించిన‌వా? కావా? అనేది వారు స్ప‌ష్టత‌నివ్వ‌లేదు.కానీ, క‌నిపించిన‌వి మాత్రం టైటాన్‌కు సంబంధించిన బ‌య‌టివైపు క‌వ‌ర్‌, లాండింగ్ ఫ్రేమ్ అని స‌ముద్రా న్వేష‌కుడు డేవిడ్ మీన్స్ బీబీసికి తెలిపారు.దీన్ని బ‌ట్టి టైటాన్ స‌ముద్రంలో పేలిపోయిఉంటుంద‌ని కొంత‌మంది నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మునిగిపోయిన టైటానిక్‌, దాదాపు 13వేల అడుగుల లోతులో ఉంది. దానికి స‌మీపంలోనే కొన్ని శ‌క‌లాలు గుర్తించిన‌ట్లు చెబుతున్న‌దాని ప్ర‌కారం జ‌లాంత‌ర్గామి టైటాన్ క‌థ విషాదాంత‌మ‌య్యేలా ఉంది. మ‌రోవైపు ఆక్సిజ‌న్ నిల్వ‌లు పూర్తిగా క్షీణించాయ‌ని , ఇక‌నుండి ప్ర‌తి నిమిష‌మూ అత్యంత విలువైందేన‌ని జ‌లాంత‌ర్గామి మాతృసంస్థ ఓష‌న్‌గేట్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు గులిర్మో సాన్లీన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

దాదాపు 10వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల వ్యాసంలో క‌నీవినీఎరుగ‌ని రెస్క్యూ ఆప‌రేష‌న్ ప్ర‌స్తుతం న‌డుస్తోంది. దీన్లో అమెరికా, కెన‌డా, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాల నౌక‌లు, అత్యాధునిక విమానాలు పాల్గొంటున్నాయి. ప్ర‌యాణీకులు సాధార‌ణ పౌరులు కాదు.

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక కుటుంబాల‌కు చెందిన‌వారు కావ‌డంతో ఈ అన్వేష‌ణ‌కు విప‌రీత‌మైన ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. అయితే, టైటానిక్ యాత్ర ఈ టైటాన్‌కు కొత్తేంకాదు. 2021 నుండి ఇప్ప‌టికి మూడుసార్లు టైటానిక్‌ను చూసి వ‌చ్చింది. టైటానిక్‌ను చూడ‌టానికి దాదాపు 2కోట్ల రూపాయ‌లను ఒక్కో ప్ర‌యాణీకుడి నుండి వ‌సూలు చేస్తుంది ఓష‌న్‌గేట్ సంస్థ‌.

Latest News