Site icon vidhaatha

Titan | దుకాణం మూసేసిన ఓషన్‌గేట్‌.. టైటాన్‌ దుర్ఘటన నేపథ్యంలో నిర్ణయం

Titan

వాషింగ్టన్‌: ఇటీవల ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర గర్భంలో పేలిపోయిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ నిర్వహణ సంస్థ ఓషన్‌గేట్‌.. తన అన్ని కార్యకలాపాలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ ఎవెరెట్‌ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ.. సముద్ర గర్భంలో పర్యాటకం, ఎక్స్‌ప్లొరేషన్‌, పరిశ్రమలు, రిసెర్చ్‌ అంశాలపై వెళ్లేవారికి సిబ్బందితో కూడిన సబ్‌మెర్సిబుల్స్‌ను అందిస్తుంది.

ఇటీవల ఈ సంస్థకు చెందిన టైటాన్‌.. సముద్రగర్భంలో వందేళ్లుగా పడి ఉన్న టైటానిక్‌ను చూపించేందుకు ఐదుగురు ప్యాసింజర్లతో వెళ్లి.. పేలిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత టైటానిక్‌కు 500 మీటర్ల దూరంలో శకలాలను గుర్తించారు. సముద్రగర్భంలోకి ప్రవేశించిన 1.45 గంటల తర్వాత టైటాన్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఓషన్‌గేట్‌ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ కూడా చనిపోయారు.

Exit mobile version