ఎక్కడో విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలో కూడా సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తెలుగు, తమిళ భాషలలో ప్రస్తుతం సీజన్ 7 జరుపుకుంటుంది. అయితే బిగ్ బాస్ షోలో ఎలాంటి రచ్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నవారు కూడా శత్రువులుగా మారి కొట్టుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవల ప్రభావం బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్‌పై పడుతుంది. ఇటీవల టేస్టి తేజాపై ప్రశాంత్ అభిమానులు దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక తమిళ బిగ్ బాస్ లో వనిత విజయ్ కుమార్ కూతురు పాల్గొనగా, ఆమెకి సపోర్ట్ అందిస్తున్న నేపథ్యంలో వనితపై కూడా దాడి జరిగినట్టు ఆమె ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.
వనిత విజయ్ కుమార్ ఎక్కువగా తన పెళ్లి విషయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మూడో పెళ్లి చుట్టూ అనేక కోణాల్లో వివాదాలు రాగా, ఈ కాంట్రవర్సీస్‌తో తెగ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ హౌజ్‌లో వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. మొదటి రోజు నుంచే జోవిక తన యాటిట్యూడ్, మెచ్యూర్డ్ గేమ్ ఆడుతూ తెగ అలరిస్తుంది. ఇక కూతురుకు వనితా మద్దతు తెలుపుతూ పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఇప్పుడు జోవిక, ప్రదీప్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుండగా, రీసెంట్‌గా ప్రదీప్ ఫ్యాన్స్ మీద కూడా వనిత కామెంట్లు చేసింది. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్‌లో ఓ వ్యక్తి వనితపై దాడి చేసినట్టుగా సమాచారం.
వనిత తనపై దాడి జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. నా మీద జరిగిన దారుణమైన దాడి గురించి సోషల్ మీడియాలో ధైర్యంగా పెడుతున్నా.. బిగ్ బాస్ షో అనేది కేవలం ఆట.. ఇలా మీరు దాడి చేయడం, హింసను సృష్టించడం మంచి పద్దతి కాదు అని వనిత చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నా సోదరి చెప్పింది. కాని న్యాయం జరుగుందనే నమ్మకం లేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేయకుండా ముందు ప్రథమ చికిత్స చేయించుకున్నాను..ఆ తర్వాత నాపై దాడి చేసిన వ్యక్తి గురించి ఆలోచించాను. నాపై దాడి చేస్తూ అతడు అన్న మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని మద్దతుదారుడే ఈ దాడి చేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది అంటూ వనిత తన పోస్ట్‌లో పేర్కొంది.