Site icon vidhaatha

Elephant Attacks| జగన్నాథ రథయాత్రలో అపశృతి..భక్తులపై దూసుకెళ్లిన ఏనుగు

విధాత : గుజరాత్‌లోని గోల్‌వాడ వద్ద జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రథయాత్రలో భాగంగా తీసుకొచ్చిన ఓ ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప తొక్కిసలాట నెలకొంది. ఏనుగు బారి నుండి తప్పించుకునేందుకు భయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాటలో తొమ్మిది మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

అయితే రోడ్డు మీదుగా పరుగులు తీస్తున్న ఆ గజరాజును మావటిలు వెంటబడి మరి అదుపు చేయడంతో పెను ప్రమాద తప్పింది. అదే సమయంలో ఊరెగింపులో ఉన్న మిగతా ఏనుగులు ప్రశాంతంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

Exit mobile version