విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Project Commission) నివేదిక(Report), గురువారం తెలంగాణ ప్రభుత్వాని(Telangana government)కి చేరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ.ఘోష్(PC Ghosh Commission) బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా(Rahul Bojja)కు రెండు షీల్డ్ కవర్ లలో నివేదిక అందించారు. ఈ నివేదికను రాహుల్ బొజ్జా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణకు అందించనున్నట్లుగా తెలిపారు. నివేదికను తాను తెరిచి చూడలేదని..అందులో ఏముందో ప్రస్తుతానికి చెప్పలేనన్నారు. ముందుగా సీఎస్ కు నివేదిక ఇచ్చాకా..తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి అందిచనున్నామని రాహుల్ బొజ్జా తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వానికి చేరిన పీసీ.ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది…బ్యారేజీలలో లోపాలకు కారకులుగా ఎవరిని పేర్కొన్నారు…వాటి నిర్మాణ స్థలాల మార్పుకు కారకులుగా ఎవరని తేల్చారు..బ్యారేజీల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం ఉందా..అక్రమాలకు బాధ్యులైన వారిపై తీసుకోవాల్సిన చర్చలకు చేసిన సిఫారసులు ఏమై ఉంటాయన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతుంది.
2023ఆక్టోబర్ లో మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా..అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి విచారణకు 2024మార్చి 14 జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ ను నియమించింది. 15నెలల పాటు సుదీర్ఘకాలంగా 119 మంది అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రజాసంఘాల నాయకులను విచారించిన కమిషన్ కాగ్ , ఎన్డీఎస్ఎ , విజిలెన్స్ నివేదికలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌ను గత నెల 6, హరీష్ రావున అదే నెల 9న మాజీ మంత్రి హరీశ్‌ను, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించింది. విచారణ పూర్తి కావడంతో జస్టిస్ పీసీ.ఘోష్ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించారు.
