iPhone 16 Pro | ఐఫోన్‌ యూజర్లకు క్రేజీ న్యూస్‌..! ఐఫోన్‌-16 ప్రో మోడల్‌లో అదిపోయే ఫీచర్స్‌..!

iPhone 16 Pro | ఐఫోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపిల్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో క్రేజ్‌ ఉన్నది. ఈ క్రమంలో కంపెనీ ఏటా సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌-15 సిరీస్‌ని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌లోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున ఫోన్స్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆపిల్‌ ఐఫోన్‌-16 సిరీస్‌ని లాంచ్‌ చేయబోతున్నది.

  • Publish Date - May 14, 2024 / 09:30 AM IST

iPhone 16 Pro | ఐఫోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపిల్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో క్రేజ్‌ ఉన్నది. ఈ క్రమంలో కంపెనీ ఏటా సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌-15 సిరీస్‌ని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌లోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున ఫోన్స్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆపిల్‌ ఐఫోన్‌-16 సిరీస్‌ని లాంచ్‌ చేయబోతున్నది. ఈ మోడల్స్‌ ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా? అని గ్యాడ్జెట్స్‌ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐఫోన్‌ ఫీచర్స్‌, డిజైన్‌, స్పెసిఫికేషన్‌కు సంబంధించి వివరాలు లీక్‌ అయ్యాయి.

దాంతో ఐఫోన్‌-16పై క్రేజ్‌ భారీగా పెరిగింది. అయితే, ఇప్పటికే ఐఫోన్‌-16 సిరీస్‌పై ఆపిల్‌ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. అయితే, తాజాగా బయటకు వచ్చిన నివేదికల ప్రకారం ఈ సారి ఐఫోన్ 15 ప్రో అప్‌గ్రేడ్ వేరియంట్, ఐఫోన్ 16 ప్రో, మునుపటి కంటే భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఐఫోన్‌-16 ప్రో మోడల్స్‌ కొంచెం పెద్ద ప్యానెల్‌తో ఎస్‌డీఆర్‌ కంటెంట్‌ కోసం 20శాతం ఎక్స్‌టా బ్రైట్‌నెస్‌ అందించనున్నట్లు తెలుస్తున్నది. మొబైల్స్‌లో కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన చిప్‌తో పాటు ‘క్యాప్చర్‌’ బటన్‌తో రానున్నదని టిప్‌స్టర్‌ ఇన్‌స్టంట్‌ డిజిటల్‌ వెబో తన నివేదికలో వెల్లడించింది. ఎస్‌డీఆర్‌ కంటెంట్‌ను చూస్తున్న సమయంలో ఐఫోన్‌-16 ప్రో మోడల్‌లో 1200 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ ఉంటుందని పేర్కొంది.

ఐఫోన్‌-15 ప్రో మోడల్స్‌లో 1000 నిట్స్‌ వరకు ఉంటుందని.. కొత్త మోడల్‌లో 20శాతం పెరిగినట్లు తెలిపింది. హెచ్‌డీఆర్‌ కంటెంట్‌ హై బ్రైట్‌నెస్‌ 1600 నిట్స్‌గా ఉంటుందని టిప్‌స్టర్‌ చెప్పింది. అలాగే, కొత్త మోడల్స్‌లో డిస్‌ప్లే రేటింగ్‌తో పాటు సైజ్‌ సైతం గతంలో పోలిస్తే పెద్దగా ఉండనున్నట్లు పేర్కొంది. ఐఫోన్‌ 16 ప్రో 6.27 అంగులాల వరకు ఉండవచ్చని.. ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ 6.85 అంగులాల డిస్‌ప్లే ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇక ఐఫోన్‌-16, ఐఫోన్16 ప్రో మోడల్స్‌లో పెద్ద బ్యాటరీలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక కొత్త ఐఫోన్లలో ఏ18 బయోనిక్‌ చిప్‌సెట్‌తో రానున్నది.

Latest News