Gig Workers | 2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 23.5 మిలియన్లు

Gig Workers | భారతదేశంలో గిగ్ వర్కర్లు 2030 నాటికి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు చేరుకుంటారని ప్రైమస్ పార్ట్ నర్స్ నివేదిక చెబుతోంది. వీళ్లంతా కూడా ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు లోపేనని నివేదిక పేర్కొంది.

Gig Workers | భారతదేశంలో గిగ్ వర్కర్లు 2030 నాటికి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు చేరుకుంటారని ప్రైమస్ పార్ట్ నర్స్ నివేదిక చెబుతోంది. వీళ్లంతా కూడా ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు లోపేనని నివేదిక పేర్కొంది. తక్కువ నైపుణ్యం కలిగిన వారు ఈ రంగం బారిన పడి చాలీ చాలనీ జీతాలతో జీవితాన్ని నెట్టుకువస్తారని స్పష్టం చేసింది. చదివిన విద్యకు తగినంతగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఆదాయ మార్గాలు లేకపోవడం వంటి కారణాలతో గిగ్ వర్కర్లుగా మారుతున్నారు. 2021 లో ఏడు లక్షల డెబ్బై వేల మంది గిగ్ వర్కర్లు ఉండగా, 2030 నాటికి 2.35 కోట్లకు చేరుకుంటున్నారని నివేదిక వెల్లడించింది.

ప్రైమస్ పార్ట్ నర్స్ అధ్యయనం ప్రకారం గిగ్ వర్కర్ల రంగం వేగంగా వృద్ధి చెందుతోందని, కార్మిక రంగంలో అనేక సమస్యలు సృష్టిస్తోంద‌ని పేర్కోంది. ఇప్పటి వరకు దేశంలో గిగ్ విధానం పార్ట్ టైమ్ జాబ్ గా చూస్తున్నారు. స్వంత ఖర్చులు సమకూర్చుకునేందుకు యువత ఈ రంగంపై ఆధారపడుతుందని అందరూ అనుకుంటున్నారు. కాని ఫుల్ టైమ్ ఉపాధిగా మారింది. 1,500 మంది గిగ్ వర్కర్ల పై ప్రైమస్ సర్వే నిర్వహించగా, 61 శాతం మంది ఫుల్ టైమ్ అనగా రోజుకు ఎనిమిది గంటల పాటు పనిచేస్తున్నారు. పశ్చిమ దేశాల్లో జేబు ఖర్చుల కోసం గిగ్ వర్కర్ గా పనిచేస్తున్నారు.

అయితే భారత దేశంలో 25 ఏళ్ల లోపు యువకులు ఈ రంగంలోకి ఎక్కువగా వస్తున్నారు. ప్రవేశానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం, తక్షణం డబ్బులు లభిస్తుండడంతో ఈ రంగంలోకి యువత ఎక్కువగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు నెలకు రూ.22,500 వరకు సంపాధిస్తున్నారు. ఎలాంటి పదోన్నతులు లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం మూలంగా ఈ ఆదాయం లభిస్తున్నది. వారంలో ఒక రోజు అధికంగా పనిచేయడం మూలంగా నెలకు అదనంగా రూ.2,500 వరకు అదనంగా ఆదాయం సమకూరుతున్నది. ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా సునాయసంగా డబ్బులు సంపాధించే రంగంగా రూపాంతరం చెందింది. నిరంతరం పనిచేయడం మూలంగానే ఆదాయం వస్తున్నదని, ఇలా పనిచేయడం మూలంగా మరింత మెరుగైన జీవితం లభించదనే విషయాన్ని యువత గ్రహించలేకపోతున్నది. మహా అయితే సూపర్ వైజర్ గా ఎదుగుతారు తప్పితే అంతకు మించి వెళ్లే అవకాశాలు లేవు. ఆదాయ మార్గాలు లేక చాలా మంది నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా అవతరిస్తున్నారు.

కాగా ఈ రంగంలో పనిచేస్తున్న వారిలో 31 శాతం మందికి ఎలాంటి సామాజిక భద్రత లేదు. కేవలం 44 శాతం మందికి మాత్రమే కొంత మేర సామాజిక భద్రత కల్పించారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆర్థికంగా ఇబ్బందులకు గురికావడంతో పాటు, సంవత్సరాల తరబడి పనిచేసి సంపాధించిన సొమ్ములు ఆవిరి అయిపోతాయి. 35 సంవత్సరాల లోపు యువత గిగ్ బానిసలుగా మారుతూ, శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారని, నైపుణ్యం పెంచుకుని మరో రంగంలోకి మారలేకపోతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన వారికి సామాజిక భద్రత కల్పించాల్సిన అవశ్యకత ఉందని ప్రైమస్ పార్ట్ నర్స్ అంచనా వేసింది. పని గంటలపై శిక్షణ, ఇన్సూరెన్స్ సౌకర్యం, లేబర్ కోడ్స్ అమలు చేయాలని సూచించింది.

Latest News