Food Delivery | గిగ్ వర్కర్ల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన గిగ్ వర్కర్ల (Gig Workers) భద్రతపై మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
స్విగ్గీ ఏజెంట్ ఫుడ్ ఆర్డర్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ట్రైన్ డెలివరీ ఫీచర్ ఉపయోగించి స్విగ్గీ ద్వారా ఆర్డర్ పెట్టాడు. సదరు ప్రయాణికుడికి ఫుడ్ డెలివరీ (Food Delivery) చేసేందుకు స్విగ్గీ ఏజెంట్ (Swiggy delivery agent) రైలు ఎక్కాడు. అక్కడ అతడికి భోజనం ఇచ్చాడు. అయితే, రైలు ఎక్కువసేపు ఆగలేదు. ఒకటి రెండు నిమిషాలు మాత్రమే స్టేషన్‌లో ఆగింది. ఆ వెంటనే రైలు కదలడంతో స్విగ్గీ ఏజెంట్ త్వరగా కిందకు దిగేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పై కింద పడిపోయాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటన గిగ్ వర్కర్ల భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఇక ఈ వీడియోకు స్విగ్వీ సైతం స్పందించింది. డెలివరీ బాయ్స్ రైలు ఎక్కి ఫుడ్ డెలివరీలు చేయొద్దని సూచించింది.
⚠️Anantapur, Andhra Pradesh: a Swiggy delivery guy fell while getting down from a moving train due to a 1–2 minute halt.
Passenger was in 1st AC; train started before the handover was completed.
He could have lost his life.
18464 (Prashanti Express) pic.twitter.com/fvjOzqg6kX— Deadly Kalesh (@Deadlykalesh) January 9, 2026
ఇవి కూడా చదవండి :
Ticket Rates | టికెట్ రేట్ల వ్యూహం ఎటు దారి తీస్తోంది .. అసలు కలెక్షన్లకే గండికొడుతున్న హైకులు
Vijay | గొప్ప వీడ్కోలు ఇవ్వాలని అనుకున్నాం.. పరిస్థితి మా చేయి దాటిందంటూ నిర్మాత ఆవేదన
