విధాత : నేపాల్ లో ఓ బస్సు నదిలో పడిపోయిన ప్రమాదంలో 18మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ధాడింగ్ జిల్లాలో పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు.
అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
