Nepal | నేపాల్‌లో నదిలో పడిన బస్సు.. 27 మంది దుర్మణం
నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్ (Tanahu) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది

బస్సులో 40మంది భారతీయులు
Nepal | నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్ (Tanahu) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 27మంది మృతి చెందినట్లు సమాచారం. కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి (Marsyangdi) నదిలో పడిపోయింది. ఈ సమాచారమందుకున్న ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
An Indian bus traveling from Pokhara to Kathmandu fell into a river. There were a total of 40 passengers on board. In this tragic incident, 14 people lost their lives, while 16 people have been rescued. Rescue and relief operations are still ongoing.
Disturbing Visual #Nepal… pic.twitter.com/Mi68mELuF3
— Vijay Singh (@VijaySikriwal) August 23, 2024
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్‌తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్ లోని పోఖారా నుంచి కాఠ్మాండూ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లోనూ నేపాల్‌లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఆ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.