Gold, Silver Rates| మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న యుద్ద పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలను కుదిపేస్తున్నాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,70,020కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.3,15,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 03, 2026, 10:59 am IST
Read Time: 2 mins
Gold, Silver Rates| మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న యుద్ద పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలను కుదిపేస్తున్నాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,70,020కు దిగివచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి..రూ.1,55,850వద్ద కొనసాగుతంది.   ఇకపోతే కిలో వెండి ధర మాత్రం క్రితం రోజు రూ.10వేలు తగ్గుదలను నమోదు చేయగా..మంగళవారం రూ.3,15,000వద్ద కొనసాగుతుంది.

యుద్దంతో బంగారం, వెండి ధరలలో భారీ మార్పులు

అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. డాలర్ విలువ పుంజుకోవడం కూడా బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులకు ఊతమిస్తుంది. ప్రస్తుతం మాత్రం పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేయడంతో సామాన్యులకు కాస్తా ఊరటనిచ్చాయి. రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ దేశాల యుద్ద పశ్చిమాసియా దేశాలకు విస్తరించడం..యుద్దం మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పసిడి ధరలు భారీ హెచ్చుతగ్గులకు గురికావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.