RBI Jobs | ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన.. అర్హతలు ఇవే..
RBI Jobs | బ్యాంకు ఉద్యోగం( Bank Job ) చేయాలనుకుంటున్నారా..? అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India )లో చేయాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యమెందుకు.. 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్బీఐ( RBI ) ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ( Degree ) చదివి ఉంటే చాలు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
RBI Jobs | బ్యాంకు ఉద్యోగాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులోనూ ఆర్‌బీఐ( RBI ) ఉద్యోగాలంటే మరి మక్కువ. ఎందుకంటే.. వారానికి ఐదు రోజులే పని దినాలు. తక్కువ పనివేళలు.. ఒత్తిడి లేని విధులు.. ఇది ఆర్‌బీఐ ప్రత్యేకత. ఇక అసిస్టెంట్‌గా ఎంపికైన వారు.. బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తారు. మూడేళ్ల తర్వాత శాఖాపరమైన పరీక్షలతో పదోన్నతులు పొందుతారు. ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు రెండు దశల్లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు ఉంటాయి.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇంపార్టెంట్..
ప్రధాన పరీక్షల్లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 11 ఖాళీలకు మాత్రమే తెలుగు భాషలో పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబై కార్యాలయంలో 249 ఖాళీలు ఉన్నాయి. వీటికి పోటీ పడడానికి మారాఠీ లేదా కొంకణి భాషలో ప్రావీణ్యం అవసరం. హిందీ భాష వచ్చిన వారు చండీగఢ్ 20/ కాన్పూర్ అండ్ లఖ్‌నవూ 50/ నాగ్‌పుర్ 17/ న్యూదిల్లీ 49 ఖాళీల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పోటీ పడవచ్చు. బెంగళూరు 24 ఖాళీలకు కన్నడ వచ్చినవారు, చెన్నై 53 ఖాళీలకు తమిళంతో పోటీ పడొచ్చు.
ఇతర ముఖ్య సమాచారం
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.
వయసు: ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఫిబ్రవరి 2, 1998 – ఫిబ్రవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 8
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు రూ.50. మిగిలిన అందరికీ రూ.450. జీఎస్‌టీ అదనం
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఏప్రిల్ 11
మెయిన్ పరీక్ష తేదీ: జూన్ 7
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram