Condoms | కండోమ్స్ వాడకంతో సంతానలేమి..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
కండోమ్స్ (Condoms) వాడకంతో సంతానలేమి సమస్యలు (Infertility problems ) వస్తాయని చాలా మంది భయపడుతున్నారు. కండోమ్‌లు లేదా ఇతర గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆందోళనలను వ్యక్తమవుతున్నాయి.
Condoms | ప్రస్తుతం చాలా మంది జంటలు పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్స్ (Condoms) వాడుతున్నారు. అయితే, ఆ కండోమ్స్ వాడకంతో సంతానలేమి సమస్యలు (Infertility problems ) వస్తాయని చాలా మంది భయపడుతున్నారు. కండోమ్‌లు లేదా ఇతర గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆందోళనలను వ్యక్తమవుతున్నాయి. అయితే, అదంతా అపోహమాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్యులు ఏం చెబుతన్నారు..?
కండోమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల సంతానలేమి సమస్యలు వస్తాయనేది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్ వెళ్లకుండా అడ్డుకుంటాయే తప్ప ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంటున్నారు. కండోమ్స్ వాడటం వల్ల పురుషులు లేదా స్త్రీల సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎటువంటి శాశ్వత ప్రభావం చూపవని వెల్లడిస్తున్నారు. కండోమ్ అనేది కేవలం ఒక తాత్కాలిక గర్భనిరోధక సాధనం మాత్రమే. ఇది వీర్యం స్త్రీ గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది తప్ప శరీరంలోని హార్మోన్లపై గానీ, వీర్యకణాల నాణ్యత (Sperm quality) పై గానీ ఎలాంటి ప్రభావం చూపదని చెబుతున్నారు.
ఇవి సురక్షితం..
పైగా కండోమ్స్ సురక్షితం కూడా. ఎందుకంటే.. లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధుల (STIs) నుంచి కండోమ్ రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఈ వ్యాధులు సోకితే భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే కండోమ్స్ పరోక్షంగా ఫర్టిలిటీ హెల్త్‌ను కాపాడుతాయే తప్ప.. సంతానోత్పత్తికి వీటివల్ల ముప్పు ఉండదు.
వాటితో జాగ్రత్త..
కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సరైనవాటిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని కండోమ్స్ వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. పర్యావరణంతో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పీఎఫ్‌ఏఎస్ (పర్-అండ్ పాలీఫ్లూలోఆల్కైల్ సబ్‌స్టాన్సెస్) కెమికల్స్‌ను కండోమ్స్ తయారీలో వాడుతున్నారు.
ట్రోజన్ ఆల్ట్రా థిన్ కండోమ్స్, కే-వై జెల్లీ క్లాసిక్ లూబ్రికెంట్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్‌ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు ఇటీవలే ఓ అధ్యయనం తేలింది. పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్ కలిసిన కండోమ్స్‌ను వాడితే క్యాన్సర్‌తో పాటు కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్ సమస్యలు, సంతాన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Hyderabad Cyber Crime : సైబర్ నేరగాళ్లపై ఆక్టోపస్ భారీ ఆపరేషన్
Milk Adulteration : రాజమండ్రి కల్తీ పాలు కేసులో కీలక పరిణామం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram