పుచ్చకాయ కూడా మనుషులను చంపగలదా? ముంబై మరణాల తర్వాత డాక్టర్లు చెప్పిన షాకింగ్​ నిజాలు

ముంబై కుటుంబ మరణాల తర్వాత పుచ్చకాయపై భయం పెరిగింది. పుచ్చకాయ వల్ల మనుషులకు మరణం ఎలా సంభవిస్తుంది? డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.

పుచ్చకాయ కూడా మనుషులను చంపగలదా? ముంబై మరణాల తర్వాత డాక్టర్లు చెప్పిన షాకింగ్​ నిజాలు పుచ్చకాయ మనుషులను చంపగలదా? ముంబై ఘటన తర్వాత పెరిగిన చర్చ

Can Watermelon Kill People? Doctors Reveal Shocking Truth After Mumbai Family Deaths

  • ముంబై ఘటనతో పుచ్చకాయపై దేశవ్యాప్తంగా చర్చ
  • కలుషితమైన పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవకాశం
  • బ్యాక్టీరియా పెరిగితే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు
  • కోసిన పండ్లు సరిగా నిల్వ చేయకపోతే ప్రమాదం
  • పుచ్చకాయ సేఫ్‌గానే ఉంటుంది.. కానీ పరిశుభ్రత ముఖ్యం

 

విధాత హెల్త్​ డెస్క్​ | హైదరాబాద్​:

Can Watermelon Kill People : వేసవి కాలంలో ప్రతి ఇంట్లో కనిపించే పండు పుచ్చకాయ. శరీరానికి చల్లదనం, దాహం తీర్చడం, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పండు. కానీ నిన్న ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద విషాహార కారణంగా మరణించిన ఘటన తర్వాత పుచ్చకాయపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. బిర్యానీ తిన్నవారు బాగానేఉన్నారు కాబట్టి, తర్వాత తిన్న పుచ్చకాయ కూడా ప్రాణాలు తీస్తుందా? సాధారణ పండు ఇలా ప్రమాదకరమవుతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లను కలవరపెడుతున్నాయి.

అవును… పుచ్చకాయ మనుషులను చంపగలదు.

Person eating fresh watermelon slices at dining table healthy summer fruit concept

పుచ్చకాయ తినడం ఆరోగ్యకరం.. కానీ పరిశుభ్రత, తాజాదనం చాలా ముఖ్యం

వైద్య నిపుణులు చెబుతున్నది ఒక్కటే. పుచ్చకాయ స్వయంగా ప్రమాదకరమైన పండు కాదు. కానీ అది కలుషితం అయితే, కోసిన తర్వాత సరిగా నిల్వ చేయకపోతే, అపరిశుభ్రంగా వాడితే తీవ్రమైన విషాహారంగా  మారే అవకాశముంది. అరుదుగా ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు.

ముంబై ఘటనలో అసలు కారణం ఇంకా అధికారికంగా తేలాల్సి ఉన్నా, కానీ ఈ సంఘటన ఆహార పరిశుభ్రత, ఆహార నిల్వ, పండ్ల భద్రతపై అనుమానాలను మాత్రం పెంచింది.

పుచ్చకాయ ఎలా ప్రమాదకరమవుతుంది? డాక్టర్లు చెప్పిన అసలు కారణాలు

Fresh sliced watermelon pieces arranged on plate showing juicy red fruit for summer health story

కోసిన పుచ్చకాయ ముక్కలు.. సరైన నిల్వ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక

పోషకాహార నిపుణుల ప్రకారం పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. సహజ చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి బ్యాక్టీరియా చేరితే అవి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోసిన తర్వాత బయట ఉంచితే ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఈ కారణాలతో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు:

Whole and cut watermelon fruits displayed in market showing fresh red pulp

మార్కెట్లో అమ్మకానికి ఉంచిన పుచ్చకాయలు.. తాజా పండ్లు మాత్రమే కొనాలని వైద్యుల సూచన

  • కోసిన పుచ్చకాయను బయట ఎక్కువసేపు ఉంచడం
  • ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడం
  • అపరిశుభ్రమైన కత్తితో కోయడం
  • కట్ చేసే ముందు బయట తొక్క కడగకపోవడం
  • రోడ్డుపక్కన దుమ్ము, ఈగలు తగిలిన ముక్కలు కొనడం
  • పాడైన పండు తినడం

వైద్యుల ప్రకారం సాల్మొనెల్లా, ఈ.కోలి, లిస్టీరియా వంటి బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి రావచ్చు. తీవ్రమైతే డీహైడ్రేషన్, సెప్సిస్, అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధకత తక్కువున్నవారికి ముప్పు ఎక్కువ.

ముంబై ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

Watermelon juice and sliced fruits on wooden table summer hydration concept

వేసవిలో శరీరానికి నీరు అందించే ఉత్తమ పండ్లలో పుచ్చకాయ ఒకటి

ముంబై ఘటనలో కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారని సమాచారం. అనంతరం కొద్ది గంటల్లోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే నిజం బయటపడుతుంది.

అయితే ఈ ఘటన మనందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేసింది:

  • పండ్లు కూడా కలుషితం కావచ్చు
  • కోసిన పండ్లు వెంటనే తినాలి
  • ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి
  • పిల్లలకు పాత పండ్లు ఇవ్వకూడదు
  • నమ్మకమైన చోటే కొనాలి
  • రాత్రి ఆలస్యంగా ఎక్కువగా తినకపోవడం మంచిది

నిజానికి పుచ్చకాయ ఎంతో ఆరోగ్యకరమైన పండు. దీన్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. శరీరానికి సరిపడా నీరు అందిస్తుంది, విటమిన్ A, C తగుపాళ్లలో ఉంటాయి, హైడ్రేషన్‌కు ఉపయోగపడుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సరిగ్గా తింటే పుచ్చకాయ సూపర్ ఫుడ్, నిర్లక్ష్యంగా తింటే సమస్య.