Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగ‌స్వామితో క‌ల‌హాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Mar 04, 2026 7:23 AM IST
Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగ‌స్వామితో క‌ల‌హాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి యోగం బలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు కీర్తిని, గౌరవాన్ని అందిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. అవసరానికి సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పొదుపు అవసరం. కొందరి ప్రవర్తన బాధిస్తుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఉద్యోగంలో మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థికాభివృద్డికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ వాక్చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రారంభించిన ప్రతీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు, గౌరవం పొందే అవకాశం ఉంది. సామాజికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో నష్టభయం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వృధా ఖర్చులు నివారించండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. మనోబలం కోల్పోకుండా స్థైర్యంతో వ్యవహరించండి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో వివేకవంతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. మీ ప్రతిభతో, సమర్థతతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు. దృఢ నిశ్చయానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపంగా ఉంటారు. మీ బుద్ధిబలంతో ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. పదోన్నతి, జీతం పెంపు వంటి ప్రయోజనాలు ఉండవచ్చు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం వలన సమస్యలు తొలగుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణసమస్యలు తగ్గుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. పని ప్రదేశంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. ఆర్థికంగా ముందుచూపుతో వ్యవహరిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మొహమాటంతో ఇబ్బందులు పడతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకూలమైన గ్రహసంచారం అద్భుతమైన యోగాన్నిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవం, అధికార యోగం ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. అధికారులతో సౌమ్యంగా నడుచుకోవాలి. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు అశాంతి కలిగిస్తాయి.