Urea App issue| యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!

యూరియా యాప్ లో ఒక్కసారి యూరియా బుక్ చేసుకుంటే మళ్లీ నెల రోజుల వరకు యూరియా బుక్ చేసుకునేందుకు అవకాశం లేకపోవడం రైతాంగానికి పంటల పరిరక్షణలో తీవ్ర ఆటంకంగా తయారైంది. రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేసి, గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు యూరియా ఇవ్వాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Mar 01, 2026, 2:44 pm IST
Read Time: 3 mins
Urea App issue| యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!

విధాత : యూరియా కోసం ప్రభుత్వాలు అన్నదాతలను అరిగోస పెడుతున్నాయి. యూరియా కొనుగోలు సక్రమంగా కొనసాగించే యోచనతో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. యాప్ లో ఒక్కసారి యూరియా బుక్ చేసుకుంటే మళ్లీ నెల రోజుల వరకు యూరియా బుక్ చేసుకునేందుకు అవకాశం లేకపోవడం రైతాంగానికి పంటల పరిరక్షణలో తీవ్ర ఆటంకంగా తయారైంది. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉండడంతో, యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారి బుక్ చేసుకుంటే నెల రోజుల వరకు యూరియా దొరకకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే స్మార్ట్ ఫోన్ వాడడం రాక, తమ వద్ద ఇప్పటికే ఉన్న కీ ప్యాడ్ సెల్ ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకోలేక గ్రామాల్లో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. యూరియా బుక్ చేసుకునేందుకు పాస్ బుక్కులోని పేరు, వివరాలు యాప్‌లో నమోదై ఉండాలి. లేకపోతే భూ యజమానులు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. సైబర్ నేరాలకు భయపడి ఓటీపీలు చెప్పేందుకు భూ యజమానులు నిరాకరించడంతో, తీవ్ర ఇబ్బందులు కౌలు రైతులు యూరియా పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేసి, గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు యూరియా ఇవ్వాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది.