Clove Water | లవంగాల నీటితో మానసిక ప్రశాంతత..! ఇది ఎంత వరకు నిజం..!
Clove Water | మరి ముఖ్యంగా లవంగాలు( Cloves ) ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. లవంగాల నీటి( Clove Water )ని ప్రతి రోజు పది రోజుల పాటు సేవిస్తే.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Clove Water | వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో బోలెడు లాభాలు ఉన్నాయి. యాలకులు, లవంగాలు( Cloves ), అల్లం, వెల్లుల్లి వంటి వాటితో చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మరి ముఖ్యంగా లవంగాలు ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. లవంగాల నీటి( Clove Water )ని ప్రతి రోజు పది రోజుల పాటు సేవిస్తే.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి లవంగాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సులభంగా జీర్ణం..
జీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు.. లవంగాల నీటితో ఉపశమనం పొందొచ్చు. జీర్ణ రసాల స్రావాన్ని పెంచి.. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
శ్వాస సంబంధిత సమస్యలు
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా లవంగం నీరు మంచి ఉపశమనంగా పని చేస్తుంది. లవంగాల్లోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గొంతు, శ్వాస మార్గాలకు హాయిగా ఉంటాయి. దగ్గు, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం తగ్గే అవకాశం ఉంటుంది.
మానసిక ప్రశాంతత
లవంగాల నీరు నరాలపై సాఫ్ట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా నిద్ర నాణ్యత మెరుగవుతుంది.
లవంగాల నీరు 10 రోజులు తాగితే ఇన్ని మార్పులు శరీరంలో చూడవచ్చు. సింపుల్‌గా, మితంగా, తీసుకుంటే చాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రుళ్లు 2–3 లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం వడకట్టి గోరువెచ్చని నీటితో తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. సరైన మోతాదులో కొన్ని రోజులు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram