Nagarjuna | నాగ్ ఎప్పుడు చాలా కూల్‌గా క‌నిపిస్తాడు క‌దా.. అందుకు ఏం చేస్తాడో తెలుసా?

Nagarjuna | టాలీవుడ్‌కి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ల అక్కినేని నాగార్జున స్ట్రాంగ్ పిల్ల‌ర్స్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే వీరిలో నాగార్జున‌ 66 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్‌నెస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

  • By: sn |    movies |    Published on : Feb 19, 2026 6:15 PM IST
Nagarjuna | నాగ్ ఎప్పుడు చాలా కూల్‌గా క‌నిపిస్తాడు క‌దా.. అందుకు ఏం చేస్తాడో తెలుసా?

Nagarjuna | టాలీవుడ్‌కి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ల అక్కినేని నాగార్జున స్ట్రాంగ్ పిల్ల‌ర్స్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే వీరిలో నాగార్జున‌ 66 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్‌నెస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల సినిమాల విషయంలో పెద్ద విజయాలు సాధించ‌క‌పోయిన‌, స్టార్‌డమ్‌ లేదా ఇమేజ్‌కి మాత్రం ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

మల్టీ టాలెంటెడ్ కింగ్

నాగార్జున కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా, టెలివిజన్ హోస్ట్‌గా కూడా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు Bigg Boss Telugu కార్యక్రమానికి హోస్ట్‌గా దాదాపు ఏడు సంవత్సరాలుగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నారు. సినిమాల మధ్యలో కూడా టీవీ ద్వారా తన స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా బిజినెస్ రంగంలోనూ సత్తా చాటుతూ టాలీవుడ్‌లో అత్యంత ధనిక హీరోలలో ఒకరిగా ఎదిగారు. సినిమాలు, వ్యాపారాలు, రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?

ఒక ఇంటర్వ్యూలో నాగార్జున తన హెల్త్ సీక్రెట్‌ను వెల్లడించారు. రోజూ ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కెరీర్‌లో భారీ నష్టాలను కూడా చూశాను. కానీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. ఆలోచిస్తే మనసు, ఆరోగ్యం రెండూ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి జరిగేదాన్ని అంగీకరించి ముందుకు సాగుతాను అని తెలిపారు.

తండ్రి చెప్పిన జీవిత సూత్రం

నాగార్జున యంగ్‌గా కనిపించడానికి ప్రధాన కారణం తన తండ్రి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు Akkineni Nageswara Rao చెప్పిన జీవన విధానమని వెల్లడించారు. జరిగేదాన్ని నువ్వు మార్చలేవు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. కానీ ఫలితంపై అతిగా ఆశ పెట్టుకోకూడదు. సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ అతిగా తీసుకోకూడదు అనే ఫార్ములానే తనకు బలం ఇచ్చిందన్నారు.

ఈ ఆలోచన విధానం వల్లే ఒత్తిడికి లోనుకాకుండా, కూల్‌గా ఉండగలుగుతున్నానని చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో ర‌జనీకాంత్‌ Rajinikanth కూడా నాగార్జున యంగ్ లుక్ గురించి ప్రస్తావించడం విశేషం.

100వ సినిమాపై ఫోకస్

ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈసారి సాలిడ్ సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. హీరో పాత్రలతో పాటు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్‌ కూడా చేస్తూ వస్తున్నారు. ‘కూలి’, ‘కుబేర’ వంటి ప్రాజెక్టుల్లో ఆయన పాత్రలకు మంచి స్పందన లభించింది.

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు యంగ్‌గా ఉంటే శరీరమూ యంగ్‌గా ఉంటుందని నాగార్జున మరోసారి నిరూపిస్తున్నారు. ఫిట్‌నెస్ కంటే ముందుగా మెంటల్ పీస్ ముఖ్యమని చెప్పే ఆయన జీవన విధానం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిగా మారుతోంది.