Ajwain Water | వాము నీరుతో బోలెడు లాభాలు..! నెలసరి నొప్పులకు ఉపశమనం..!!
Ajwain Water | వాము నీరు( Ajwain Water )ను చాలా మంది తక్కువ అంచనా వేస్తుంటారు.. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని, బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. జీర్ణక్రియ( Digestive System )ను మెరుగుపరచడంతో పాటు బరువును తగ్గిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పికి కూడా వామునీరు ఉపశమనంగా పని చేస్తుంది.
Ajwain Water | చాలా మంది ఆరోగ్య నియమాలు( Health Tips ) పాటిస్తుంటారు. ఆరోగ్య నియమాల్లో భాగంగా కొందరు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగుతుంటారు. మరికొందరేమో హెర్బల్ డ్రింక్స్( Herbal Drinks ) సేవిస్తుంటారు. ఈ హెర్బల్ డ్రింక్‌లో వాము నీరు( Ajwain Water ) కూడా ఉంది. ఈ వాము నీరును చాలా మంది తక్కువ అంచనా వేస్తుంటారు.. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని, బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువును తగ్గిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పికి కూడా వామునీరు ఉపశమనంగా పని చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ..
చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. తిన్న ఆహారం జీర్ణం కాక అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారికి వాము నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాములోని థైమోల్ గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని పెంచుతుంది. ఈ నీటిని సేవించడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కండరాలు కూడా కుదుటపడుతాయి. కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయం వామునీరు తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
బరువు తగ్గేందుకు..
అధిక బరువుతో ఉన్న వారు బరువు తగ్గేందుకు అనేక కసరత్తులు చేస్తుంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. అయితే వామునీరును తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొవ్వులు కరిగిపోతాయి. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది.
గుండెల్లో మంట..
వాము ఎసిడిటీ, గుండెల్లో మంటను బాగా తగ్గిస్తుంది. యాంటాసిడ్ లక్షణాలు కలిగి ఉండి.. ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల యాసిడ్ ఉత్పత్తి కంట్రోల్ అవుతుంది. స్పెసీ ఫుడ్, కెఫిన్ తీసుకునేవారికి ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఇది గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది.
నెలసరి నొప్పి నుంచి ఉపశమనం..
మహిళలకు నెలసరి వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి భరించలేక విలవిలలాడిపోతారు. వాము నీరు తీసుకోవడం వల్ల నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. తిమ్మిర్లు మాయమవుతాయి. పొత్తి కడుపులో నొప్పి ఉండదు. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గర్భాశయ కండరాలు విశ్రాంతి పొందుతాయి. నొప్పి నివారణ మందుల అవసరం లేకుండా ఉపశమనం లభిస్తుంది.
వీటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేయడానికి, రక్తపోటు నియంత్రించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి బీపీ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యానికి కూడా మద్ధతు అందుతుంది. కాలేయ పనితీరుకు మంచిది. శరీరాన్ని డీటాక్స్ చేసి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మీరు కూడా వైద్యుల సహాయంతో ఈ డ్రింక్‌ని మీ డైట్లో చేర్చుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram