Lukewarm Water | గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలుసా..?

చాలా మంది ఉద‌యం లేవ‌గానే గోరువెచ్చ‌ని నీళ్లు (lukewarm water) తాగుతుంటారు. అలా చేయ‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ మ‌రుగుప‌డుతుంది. బరువు తగ్గుతారు. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారిలో గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.

Lukewarm Water | గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలుసా..?

lukewarm water | చాలా మంది ఉద‌యం లేవ‌గానే గోరువెచ్చ‌ని నీళ్లు (lukewarm water) తాగుతుంటారు. కాఫీ, టీకి ప్ర‌త్యామ్నాయంగా వేడి నీటిని తాగేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత అధిక శాతం మంది ప్ర‌జ‌లు గోరెవెచ్చ‌ని నీళ్ల‌ని తాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో వేడి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ శ‌రీరానికి త‌గిన‌న్ని నీళ్లు అవ‌స‌రం. అందుకే దాహం వేయ‌క‌పోయినా నీళ్ల‌ను తాగుతూ ఉండాల‌ని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల బాడీ డీహైడ్రేష‌న్‌కు గురి కాదు. అంతేకాదు, చ‌ర్మానికి తేమ అంది ముఖం కాంతివంతంగా ఉంటుంది. అయితే, చాలా మంది వేడి నీటికి బ‌దులు సాధార‌ణ నీటిని తాగుతుంటారు. కానీ, గోరువెచ్చ‌ని నీళ్లు తాగితేనే మంచిద‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.

ఉదయాన్నే పరగడుపున రెండు గ్లాసుల‌ గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం (detoxification), బరువు తగ్గడం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సాయ‌ప‌డ‌తాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారిలో గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. వెచ్చని నీటితో ఒంట్లోని అవయవాలు ఉత్తేజితమవుతాయి. కండరాలు బిగుసుకొనిపోవు.

నెల‌స‌రిలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయి..

అంతేకాదండోయ్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, కండరాల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఉండే విసుగు, అలసట తగ్గిపోతాయ‌ట‌. ముఖంపై మొటిమలు కూడా రావు. చుండ్రు బాధలు తగ్గుతాయి. జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. అయితే, బ్రెష్ చేయ‌క‌ముందే వీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చ‌ర్మ ఆరోగ్యానికి కూడా గోరు వెచ్చ‌ని నీరు మంచిది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మందికి తెలియదు. గోరువెచ్చని నీరు జీవక్రియ ప్రక్రియను పెంచుతుంది. శరీరంలోని కొవ్వు కణాలను కరిగించి, బరువు తగ్గడం సులభం అవుతుంది. అంతేకాదు, గొంతులో మంట‌, ఇబ్బందిగా ఉన్నా గోరు వెచ్చ‌ని నీళ్లు తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులు గోరు వెచ్చ‌ని నీళ్లు తాగితే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. గోరువెచ్చని నీరు శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి :

Pratyusha | ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు .. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు
Gold Silver Rates Today | తగ్గిన బంగారం, వెండి ధరలు !