Varalaxmi | “బట్టలు కాదు… మనసులు మారాలి”.. చెల్లిని కూడా వంక‌ర‌గా చూస్తారా అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ కామెంట్స్

Varalaxmi | సమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు వారి దుస్తులే కారణమని జ‌రుగుతున్న చ‌ర్చ‌పై వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మహిళల డ్రెస్సింగ్‌ను కారణంగా చూపిస్తూ వేధింపులను సమర్థించే మనస్తత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

  • By: sn |    movies |    Published on : Mar 05, 2026 11:30 AM IST
Varalaxmi | “బట్టలు కాదు… మనసులు మారాలి”.. చెల్లిని కూడా వంక‌ర‌గా చూస్తారా అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ కామెంట్స్

Varalaxmi | సమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు వారి దుస్తులే కారణమని జ‌రుగుతున్న చ‌ర్చ‌పై వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మహిళల డ్రెస్సింగ్‌ను కారణంగా చూపిస్తూ వేధింపులను సమర్థించే మనస్తత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అమ్మాయిలు వేసుకునే బట్టలు సమస్య కాదని, వారి ఆలోచనల్లోనే స‌మ‌స్య‌ ఉందని ఆమె స్పష్టం చేశారు. సమాజంలో నిజమైన మార్పు రావాలంటే మహిళలు తమ దుస్తులు మార్చుకోవడం కాదు, పురుషుల ఆలోచనా విధానం మారాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.

ఈ సందర్భంగా దుస్తుల కారణంగా వేధింపులు జరుగుతున్నాయని చెప్పే వారికి వరలక్ష్మి ఒక సూటి ప్రశ్న కూడా వేశారు. “మీ ఇంట్లో మీ అక్క లేదా చెల్లి షార్ట్స్ వేసుకుని బయటకు వస్తే… వారిని చూసి మీకు చెడు ఆలోచనలు వస్తాయా?” అని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న మహిళలను చూసినప్పుడు రాని ఆలోచనలు, బయట ఇతర మహిళలను చూసినప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తూ ఇది వ్యక్తిత్వ లోపమేనని ఘాటుగా విమర్శించారు.ముఖ్యంగా మహిళల లోదుస్తుల గురించి సమాజంలో ఉన్న విచిత్రమైన దృక్కోణాన్ని కూడా ఆమె ఎండగట్టారు.

ఒక మహిళ బ్రా స్ట్రాప్ పొరపాటున బయటకు కనిపిస్తే దాన్ని పెద్ద విషయం చేసి ఎందుకు చూస్తారని ప్రశ్నించారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్‌వేర్ మాత్రమేనని, అది ప్రతి మహిళకు సాధారణమైన అవసరమని ఆమె తెలిపారు.మగవారి దుస్తులతో పోల్చుతూ వరలక్ష్మి ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. “మగవారు జీన్స్ ప్యాంట్ వేసుకుని వంగినప్పుడు వారి లోదుస్తులు కనిపిస్తాయి. కానీ దాన్ని చూసి ఎలాంటి మహిళా వారి మీద అఘాయిత్యాలకు పాల్పడదు కదా?” అని ఆమె ప్రశ్నించారు. మరి మగవారి విషయంలో అభ్యంతరం లేని విషయాన్ని మహిళల విషయంలో మాత్రమే ఎందుకు తప్పుగా చూస్తారని ఆమె ప్రశ్నించారు.

ప్రతి వ్యక్తి తన శరీరంపై, తన దుస్తులపై పూర్తి హక్కు కలిగి ఉంటారని వరలక్ష్మి స్పష్టం చేశారు. ఒకరి డ్రెస్సింగ్‌ను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైంది కాదని హెచ్చరించారు. మహిళలు అందంగా ఉన్నారని అనుకోవడంలో తప్పు లేదని, కానీ ఆ అభిప్రాయం గౌరవప్రదంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి విషయాలపై తాను నిర్భయంగా మాట్లాడటానికి కారణం, తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతర మహిళల్లో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశమేనని వరలక్ష్మి తెలిపారు. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా గళం ఎత్తాలని, సమాజంలో మార్పు రావడానికి ప్రతి మహిళ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘సరస్వతి’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.