నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్‌మెంట్ విలువ తెలుసా!
ఇరాన్ దాడులతో నాలుగు రోజుల్లోనే అమెరికా సైనిక సామగ్రికి భారీ నష్టం. రాడార్లు, ఎఫ్-15 యుద్ధ విమానాలు సహా సుమారు 2 బిలియన్ డాలర్ల మిలిటరీ ఎక్విప్‌మెంట్ ధ్వంసమైనట్లు అంచనా.
ఇరాన్ మీద ముప్పేట దాడులు చేస్తున్న అమెరికా.. నాలుగు రోజుల్లోనే పెద్ద మొత్తంలో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను కోల్పోయింది. వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న ఇరాన్… తన సమీప దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఇరాన్ దాడుల్లో నాశనమైందని అంచనా వేస్తున్నారు.
ఖతార్‌లోని అల్ ఉదేయిద్ ఎయిర్ బేస్ వద్ద అమెరికా ఒక ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలోని ఏఎన్/ఎఫ్‌పీఎస్–132 ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థపై ఇరాన్ క్షిపణి దాడి చేసిందని ఖతార్ అధికారులు ధృవీకరించారు. ఈ రాడార్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్
ఆదివారం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ.. పొరపాటున అమెరికాకు చెందిన మూడు ఎఫ్–15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ మూడు విమానాలు … సుమారు 282 మిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా.
బహ్రెయిన్‌లో అమెరికా నేవీ బేస్‌పై దాడి
మరో దాడిలో బహ్రెయిన్ రాజధాని మనామాలోని అమెరికా నేవీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్నిలక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో రెండు కమ్యూనికేషన్ టెర్మినల్స్, పలు భారీ భవంతులు ధ్వంసం అయ్యాయని సమాచారం. వీటిని ఏఎన్/జీఎస్‌సీ–52బీ సాట్‌కామ్ టెర్మినల్స్‌గా గుర్తించారు. ఇది ఒక్కోటీ సుమారు 20 మిలియన్ డాలర్లు విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పారిశ్రామిక నగరం అల్ రువాయిస్‌లో ఏర్పాటు చేసిన THAAD Anti-Ballistic Missile (ABM) వ్యవస్థలోని AN/TPY-2 రాడార్ కాంపొనెంట్‌ను నాశనం చేశామని ఇరాన్ చెబుతున్నది. ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ చిత్రాల ప్రకారం.. ఈ వ్యవస్థపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఇక్కడ ధ్వంసమైన రాడార్ కాంపొనెంట్ విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ఇవన్నీ కలుపుకొంటే.. మధ్య ఆసియా ప్రాంతంలోని అమెరికా సైనిక సంపత్తికి ఇరాన్ కలిగించిన నష్టం రెండు వందల కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా దాడులు మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ ఇరాన్.. మధ్య ఆసియాలోని ఏడు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అందులో.. బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ కేంద్ర కార్యాలయం, కువైట్‌లోని క్యాంప్ అరిఫ్‌జన్, అలీ అల్ సలేమ్ ఎయిర్‌బేస్, క్యాంప్ బుయిరింగ్, ఇరాక్‌లోని ఎర్బిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని జెబెల్ అలీ పోర్ట్, ఖతార్‌లోని అల్ ఉదేయిద్ ఎయిర్‌బేస్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
Naga Chaitanya | వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్‌లో ప్రమాదం.. కుర్చీ విరిగి కిందపడిన నాగచైతన్య, అభిమానుల్లో కలకలం
Vijay-Trisha | విజయ్-త్రిష ఒకే కారులో.. వైరల్ వీడియోతో మళ్లీ వేడెక్కిన రూమర్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram