Revanth Reddy Amit Shah meeting| ఐపీఎస్ ల కేడర్ సంఖ్య పెంచండి : అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్యను పెంచాలని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై సమావేశంలో చర్చించారు. తెలంగాణకు ఐపీఎస్ కేడర్ సంఖ్యను 83 నుంచి 105కు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Revanth Reddy Amit Shah meeting| ఐపీఎస్ ల కేడర్ సంఖ్య పెంచండి : అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

విధాత : తెలంగాణకు ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్యను పెంచాలని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీ బి. సుమతి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

83 నుంచి 105కు పెంచండి

ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమీషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి కి వివరించారు. ఈ కారణంగా తెలంగాణకు ఇంకా ఎక్కువ ఐపీఎస్ అధికారుల అవసరాన్ని వివరించి తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచవలసిన అవసరాన్ని తెలిపారు. అంతేకాకుండా శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణకు అదనంగా ఐపిఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరమని, ఈ దిశగా కేంద్ర హోం శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో మొదటిసారి క్యాడర్‌ రివ్యూ జరిగిందని గుర్తు చేశారు. 2021లో జరగాల్సిన రివ్యూ ఇంకా ఆలస్యంగా 2025లో జరిగింది అని, ఆ సమయంలోనూ ఏడుగురు ఐపీఎస్‌లను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. ఈ ఏడాది మరోమారు క్యాడర్‌ రివ్యూ నిర్వహించాలని, ప్రస్తుతం తెలంగాణలో 83 మంది ఐపీఎస్‌ అధికారులు మాత్రమే ఉన్నారు అని, ఈ సంఖ్యను 105కు పెంచండి అని రేవంత్‌రెడ్డి కోరారు.

మావోయిస్టుల లొంగుబాటు పురోగతిపై చర్చ

అదేవిధంగా, రాష్ట్రంలో ఈమధ్య అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు నాయకుల విషయం కూడా భేటీలో కీలకంగా చర్చించారు. మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక అందించారు. రాష్ట్రానికి సంబంధించి మిగిలిన మావోయిస్టు నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం సంబంధించిన విషయాలను సీఎం ఈ సమావేశంలో వివరించారు. గత రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, మొత్తం 591 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావడం శుభపరిణామమని, వీరందరికీ ప్రభుత్వం తరపున కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా చర్చించారు.

ఆపరేషన్‌ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారు అని, ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాలని ఈ సందర్బంగా అమిత్‌ షా కోరారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని సూచించారు. తెలంగాణలో ఈగల్‌ టీమ్‌ను బలోపేతం చేయాలని తెలిపారు.