Sleep | సరైన నిద్ర లేకుంటే గుండెకు నష్టమే..! తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
Sleep | ప్రతి ఒక్కరూ తమ తమ పరిధుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రయివేటు ఉద్యోగస్తులైతే కుర్చీలకే అతుక్కుపోతున్నారు. కనీసం విశ్రాంతి తీసుకోకుండా పనికి అంకితమైపోతున్నారు. కంటి నిండా నిద్ర( Sleep ) కూడా కరువైంది అని చెప్పొచ్చు. ఇలా నిద్రకు దూరం అవుతున్న వారికి గుండె పోటు( Heart Stroke ) తప్పదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర లేకుంటే గుండెకు నష్టమే అని తేల్చిచెబుతున్నారు.
Sleep | ప్రయివేటు సెక్టార్‌లో పని చేసే ప్రతి ఒక్కరూ.. మరి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులైతే( Software Employees ) తమ టార్గెట్స్‌ను రీచ్ అయ్యేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. మరి ఈ మధ్య కాలంలో కుర్చీలకే అతుక్కుపోతున్నారు టెకీలు. ఎందుకంటే లే ఆఫ్‌లు కూడా సమస్యగా మారింది. కాబట్టి తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు నిద్ర( Sleep )ను కూడా నిర్లక్ష్యం చేస్తూ పనిలో నిమగ్నమవుతున్నారు. ఇలా పని ఒత్తిడితో కనీసం నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి వారు గుండె పోటు( Heart Stroke )కు గురవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ జాగ్రత్తలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి ఉద్యోగి రోజుకు ఏడెనిమిది గంటల పాట పని చేస్తారు. ఇంతకు మించి పని చేస్తే శరీరం అలసటకు గురవుతుంది. వారానికి 55 గంటల కంటే ఎక్కువగా పని చేసే వ్యక్తులు గుండె జబ్బులకు గురవుతున్నారు. గుండెపోటు ప్రమాదం 35 నుంచి 40 శాతం పెరుగుతుందని తేలింది. పని ఒత్తిడిలో పడి నిద్రకు దూరమవుతున్నారు. నిద్ర లేమి వల్ల గుండెపోటుకు గురవుతున్నారు.
మరి ఎన్ని గంటలు నిద్రించాలి..?

మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర అనేది మానవుడి గుండె, రక్తనాళాలు సహాజంగా తమను తాము మరమ్మతు చేసుకునే సమయం. అయితే ఈ విషయాన్ని విస్మరించి.. పనిపై ధ్యాస పెడుతున్నారు. దీంతో గుండె, రక్తనాళాలకు మరమ్మతు చేసుకునే సమయం ఇవ్వడం లేదు. కాబట్టి.. రోజుకు కనీసం ఆరేడు గంటల పాటు నిద్రించాలి. ఇంతకు తక్కువ నిద్రిస్తే రక్తపోటు పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది. అలాగే సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం సహజ జీవ గడియారం దెబ్బతింటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
వారం మొత్తం నిద్ర మానేసి వీకెండ్‌లో ఎక్కువగా నిద్రపోవడం కూడా మంచిది కాదు. నిద్ర అనేది లగ్జరీ కాదు.. శరీరానికి అవసరం అని అందరూ గుర్తించుకోవాలి. స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ స్థాయి పెరిగి హార్ట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కూడా హార్ట్ రిస్క్ పెంచుతుందని చెప్పొచ్చు. ప్రతి 45–60 నిమిషాలకు 5 నిమిషాల బ్రేక్ తీసుకోవచ్చు. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల విశ్రాంతి, నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు మరింత ప్రొడెక్టివ్గా వర్క్ చేయగలుగుతారు. పని సులభం అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకునేందుకు యోగా వంటివి చేయాలి. ఇవి ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram