Virosh | విజ‌య్ దేవర‌కొండ‌-ర‌ష్మిక ప్రేమ క‌థ‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఇద్ద‌రిలో ముందుగా ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారంటే..!

Virosh | టాలీవుడ్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవ‌ల‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిశ్శబ్దంగా కొనసాగిన ప్రేమాయణానికి ఫిబ్రవరి 26న ముగింపు పలుకుతూ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది

  • By: sn |    movies |    Published on : Mar 05, 2026 10:10 AM IST
Virosh | విజ‌య్ దేవర‌కొండ‌-ర‌ష్మిక ప్రేమ క‌థ‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఇద్ద‌రిలో ముందుగా ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారంటే..!

Virosh | టాలీవుడ్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవ‌ల‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిశ్శబ్దంగా కొనసాగిన ప్రేమాయణానికి ఫిబ్రవరి 26న ముగింపు పలుకుతూ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకత ఏమిటంటే, రెండు సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్

పెళ్లి అనంతరం ఈ స్టార్ జంట కోసం మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ పంచకట్టులో ‘పెదరాయుడు’ లుక్‌లో రాయల్‌గా కనిపించగా, రష్మిక మందన్న ఎరుపు రంగు చీరలో అద్భుతంగా మెరిసింది. ఈ వేడుకకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.

మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడిన విజయ్

రిసెప్షన్‌కు ముందు తెలుగు మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది… ఆమెను మీరు అందరూ ప్రేమగా చూసుకోవాలి. మీ ఆశీస్సులు మాకు ఎంతో అవసరం,” అంటూ రష్మికను పరిచయం చేశారు. “మా ప్రయాణంలో మీడియా ఎప్పుడూ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు పెళ్లి తర్వాత జంటగా మీ ముందుకు రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది,” అని విజయ్ తెలిపారు.

రష్మిక కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ, “మా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఎప్పటికీ అవసరం,” అని చెప్పింది.

ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు?

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట లవ్ స్టోరీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా “ముందుగా ప్రేమను వ్యక్తం చేసింది ఎవరు?” అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందననే మొదట విజయ్ దేవరకొండకు ప్రేమను వ్యక్తం చేసింద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసిన‌ట్టు స‌మాచారం.

సినిమాల నుంచే మొదలైన ప్రేమ

విజయ్–రష్మిక పరిచయం 2018లో విడుదలైన ‘గీతా గోవిందం’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ సినిమాలో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తరువాత 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఈ సినిమా తర్వాతే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో రూమర్లు, ఊహాగానాల మధ్య కూడా తమ బంధాన్ని బయటపెట్టకుండా ఎనిమిదేళ్లు గడిపిన ఈ జంట, చివరికి పెళ్లితో తమ ప్రేమకథను అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విరోష్ జంట

రిసెప్ష‌న్ వేడుకలో విజయ్ దేవరకొండ పంచె కట్టుకొని సంప్రదాయ ‘పెదరాయుడు’ స్టైల్‌లో రాయల్‌గా కనిపించాడు. మరోవైపు రష్మిక మందన్న ఎరుపు రంగు శారీలో అందంగా మెరిసింది. కొత్త దంపతులుగా వేదికపై కనిపించిన ఈ జంటను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. .