Swiggy Snacc | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ‘స్నాక్’ (Snacc) సేవలను ప్రారంభించిన ఏడాదిలోనే మూసివేసింది. ఆశించిన స్థాయిలో లాభాలు (less profitable) లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉన్న వ్యాపారాలపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ కంపెనీ అంతర్గత ఈ-మెయిల్‌లో పేర్కొంది.
స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ కంపెనీకి పోటీగా ఉన్న క్విక్‌కామర్స్ సంస్థలైన జెప్టో- కేఫ్, బ్లింకిట్- బిస్ట్రోను ప్రారంభించడంతో స్విగ్గీ కూడా స్నాక్ యాప్‌ను స్టార్ట్ చేసింది. బెంగళూరు కేంద్రంగా ‘స్నాక్’ యాప్ గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. స్నాక్స్, బెవరేజెస్, మినీ మీల్స్, డెజర్ట్స్ వంటి ఈజీగా అందివ్వగలిగే ఫుడ్ ఐటమ్స్‌ను ఇది డెలివరీ చేసేది. హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర స్టోర్స్‌కు ఐటమ్స్ సరఫరా చేసే సంస్థల నుంచి ‘స్నాక్’ ఆహారోత్పత్తుల్ని సేకరించి, వినియోగదారులకు చేరవేస్తుండేది.
అయితే ఈ స్నాక్‌తో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ ఏడాది కాలంగా అనుకున్నంతగా లక్ష్యాన్ని చేరుకోలేదు. పరిమిత సంఖ్యలో అమ్ముడవ్వడం, లాభదాయకత పెద్దగా లేకపోవడంతో స్నాక్‌ను మూసివేయాలని స్విగ్గీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే స్నాక్ సేవలకు ముగింపు పలికింది. ఇక గతేడాది మే నెలలో జొమాటో కూడా ఇలానే హోమ్‌స్టైల్ మీల్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Mohammad Azharuddin : అజారుద్దీన్ పదవి గండాన్ని…తప్పించే త్యాగశీలి ఎవరో ?
Garbage Girl | నేను చెత్తను ఎంచుకోలేదు.. అదే నన్ను ఎంచుకుంది.. ఇండియన్ గార్బేజ్ గర్ల్ స్ఫూర్తిదాయకమైన కథ
