విధాత: దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ ఈ కామర్స్ సంస్థలు ప్రకటనలు ఇవ్వొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ నిర్ణయం ఎత్తివేయాలని క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ సంస్థలకు స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో 10నిమిషాల క్విక్ డెలివరీ ఒత్తిడి నుంచి డెలివరీ బాయ్స్ కి ఊరట దక్కినట్లయ్యింది. గిగ్ వర్కర్ల భద్రత దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మండవీయా బ్లింకెట్, జఫ్టో, స్విగ్గీ, జోమాటో ప్రతినిధులతో చర్చలు జరిపారు.
కేంద్రం చొరవతో ఇప్పటికే ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ ఫారం బ్లింకెట్ 10 నిమిషాల క్విక్ డెలివరీ సదుపాయం నిలిపివేనున్నట్లు పేర్కొంది. త్వరలోనే మిగతా ప్లాట్ ఫార్మర్లు కూడా 10 నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Stray Dog Bites : వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Army Chief Upendra Dwivedi : ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
