Army Chief Upendra Dwivedi : ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడితే భూతల దాడులతో గట్టిగా బదులిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు.

Army Chief Upendra Dwivedi

విధాత: భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు వేసే ఉగ్ర సంస్థలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడితే గట్టిగా బదులిస్తాం అని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని, దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ను పక్కా ప్రణాళికలతో త్రివిధ దళాల సమన్వయంతో ఖచ్చితమైన లక్ష్య సాధనతో అమలు చేశామని తెలిపారు. 88గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ లో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేి..100మంది ఉగ్రవాదులను అంతమొందించామని..ఆనాటి ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ ఏ మాత్రం అదుపు తప్పినా..భూతల దాడులకు మేం సిద్దంగా ఉన్నామని గుర్తు చేశారు.

చైనా సరిహద్దుల్లో సైనిక బలగాల మోహరింపులు పటిష్టంగానే ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలనైనా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్దంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పూర్తి సన్నద్దతో ఉన్నామన్నారు. పాకిస్తాన్ షక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగిస్తూ చేసుకున్న 1963ఓప్పందాన్ని మేం గుర్తించబోమని, ఆ ప్రాంతంలో ఆ దేశాలు చేపట్టే ఏ చర్యనైనా చట్టవిరుద్ధంగానే పరిగణిస్తామని అని ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Sankranti Cock Fights : సంక్రాంతి కోడి పందాలు..రక్త చరిత్ర మూలాలు
Diabetes | భారత్‌ పాలిట ఆర్థిక భారంగా మారిన డయాబెటిస్‌.. ప్రపంచంలోనే రెండో స్థానంలో

Latest News