Instamart 2025: ₹22 Lakh Cart With 22 iPhones, Gold and Eggs Shows India’s Viral Shopping Shift
- ఒక్కడే ఏడాదిలో 22 లక్షల షాపింగ్
- 10 రూపాయల ప్రింటౌట్ అతిచిన్న ఆర్డర్
- 5 లక్షల ఐఫోన్‌లు అతిపెద్ద ఆర్డర్
- ఓ చెన్నై మహా‘పురుషుడు’ లక్ష రూపాయల కండోమ్స్ కొనుగోలు
- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదికలో నివ్వెరపరిచే నిజాలు
హైదరాబాద్ | విధాత వైరల్ డెస్క్:
ఒకప్పుడు “పాలు అయిపోయాయ్”, “గుడ్లు తెప్పించాలి” అనగానే గుర్తుకొచ్చే యాప్…స్విగ్గీ ఇన్స్టామార్డ్. ఇప్పుడు ఐఫోన్‌లు, బంగారం, గిఫ్టులు కూడా 10 నిమిషాల్లో తీసుకొచ్చే ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది. Swiggy Instamart విడుదల చేసిన How India Instamarted 2025 నివేదిక చూస్తే, భారత్‌లో షాపింగ్ అలవాట్లు ఎంత వేగంగా మారాయో అర్థమవుతుంది.
ఈ ఏడాది ‘టాప్ స్పెండర్’ ఒకరు మొత్తం 22 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. అతడి కార్ట్‌లో ఉన్నవి షాక్ ఇచ్చేలా ఉన్నాయి .. 22 ఐఫోన్ 17లు, 24 క్యారెట్ బంగారు నాణేలు, ఎయిర్‌ఫ్రయ్యర్, అదే సమయంలో పాలు, గుడ్లు, ఐస్‌క్రీమ్, పండ్లు, టిక్‌టాక్‌లు కూడా!
10 రూపాయల ప్రింటౌట్ నుంచి 4.3 లక్షల ఐఫోన్‌ల వరకూ!
ఈ ఏడాది ఇన్స్టామార్డ్ రికార్డులు సోషల్ మీడియా నిండా వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో ఒక వినియోగదారు రూ.10కి ప్రింటౌట్ ఆర్డర్ చేయడం 2025లో అతి చిన్న కార్ట్‌గా నిలిచింది. ఇదే ఏడాది హైదరాబాద్‌లో ఒకరు ఒకే ఆర్డర్‌లో 4.3 లక్షల రూపాయల విలువైన ఐఫోన్‌లు కొనుగోలు చేసి ‘బిగ్గెస్ట్ సింగిల్ కార్ట్’ రికార్డు బద్దలు కొట్టాడు. అవసరం ఎంత చిన్నదైనా, ఖర్చు ఎంత పెద్దదైనా… “10 నిమిషాల్లో వస్తుంది” అన్న నమ్మకమే ఈ బీభత్సానికి కారణం. అంతేకాదు, బద్ధకం అనే అతిపెద్ద వ్యాధి కూడా.
పాలు, వెన్న, చిప్స్… ఇండియా కిచెన్ పవర్
2025లో భారత్ ప్రతి సెకనుకు నాలుగు ప్యాకెట్ల పాలు ఆర్డర్ చేసింది — ఆ పరిమాణం 26,000 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపగలంత! చీజ్ కంటే పనీర్ 50% ఎక్కువగా అమ్ముడయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లో వెన్న & స్ప్రెడ్స్ ఇంకా టాప్‌లోనే ఉన్నాయి.
అయితే అర్థరాత్రి హీరో మాత్రం ఆశ్చర్యమే — బంగాళదుంప (ఆలూ)! మసాలా చిప్స్. దేశంలోని టాప్ 10 నగరాల్లో 9 నగరాల్లో నంబర్–1 లేట్‌నైట్ స్నాక్ ఆలూ చిప్స్.
ఇది కేవలం పప్పులు, ఉప్పుల కథ మాత్రమే కాదు. బంగారం, వెండి, ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా ఇన్స్టాలోనే..
- హైదరాబాద్: ఒకే ట్యాప్‌తో మూడు ఐఫోన్ 17లు — ₹4.3 లక్షలు
- నోయిడా: బ్లూటూత్ స్పీకర్లు, SSDలు, రోబోటిక్ వాక్యూమ్‌లు — ₹2.69 లక్షలు
- బెంగళూరు: దీపావళికి 1 కిలో వెండి ఇటుక — ₹1.97 లక్షలు
- ధన్‌తేరాస్ రోజున బంగారం ఆర్డర్లలో 400% వృద్ధి
భారతీయులు ఇప్పుడు బంగారం కూడా యాప్‌లోనే కొనే స్థాయికి వచ్చారు.
కండోమ్స్ , నూడుల్స్, రెడ్‌బుల్, … ఇవే వైరల్ ఆర్డర్లు
2025లో ఇన్‌స్టామార్ట్ చూసిన కొన్ని షాకింగ్ కార్టులు( అంటే.. ఒక్కరే చేసిన ఆర్డర్లు)
- బెంగళూరు: ₹4.36 లక్షల నూడుల్స్
- ముంబై: ₹16.3 లక్షల రెడ్‌బుల్ (షుగర్ ఫ్రీ)
- చెన్నై: 228 సార్లు కండోమ్స్ — మొత్తం ₹1.06 లక్షలు
- నోయిడా: జిమ్ బ్రో కార్ట్ — ₹2.8 లక్షల ప్రోటీన్
- చెన్నై: పెంపుడు జంతువులపై ప్రేమ — ₹2.41 లక్షల పెట్ సప్లైస్
ఈ ఇన్స్స్టామార్ట్ నివేదిక ఇన్‌స్టంట్‌గా సోషల్‌మీడియాలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. నెటిజన్లు రకరకాలుగా విడిపోయి చర్చల మీద చర్చలు, నవ్వుల మీద నవ్వులు.. పెద్దోళ్ల మూతివిరుపులు, చిన్నోళ్ల కామెంట్లు, జోకులు..
బెంగళూరు.. దయాహృదయుల రాజధాని
డెలివరీ పార్ట్‌నర్లకు ₹68,600 టిప్ ఇచ్చిన ఒక బెంగళూరు వినియోగదారుడు దేశంలోనే టాప్ దాన కర్ణుడు. చెన్నైలో ఓ బలిచక్రవర్తి రెండో స్థానం. అలాగే బెంగళూరు కొత్త రుచులకు, అర్థరాత్రి ఆర్డర్లలకు పేరుపొందింది. అన్నట్లు, ఈ క్విక్ కామర్స్ వృద్ధిలో ఇప్పుడు చిన్న నగరాలే పెద్ద. రాజ్‌కోట్‌లో 10 రెట్లు వృద్ధి కాగా, లూధియానా 7 రెట్లు, భువనేశ్వర్ 4 రెట్లు, ఇంకా హెల్త్ & వెల్‌నెస్‌లో భోపాల్ 16 రెట్లు వృద్ధి నమోదు చేసింది.
రెండు నిమిషాల నూడుల్స్… 2 నిమిషాల్లోనే డెలివరీ.!
ఈ ఏడాది ఫాస్టెస్ట్ డెలివరీలు కూడా వైరల్ వార్తే. లక్నోలో 2 నిమిషాల మ్యాగీ 2 నిమిషాల్లో డెలివరీ చేయగా, పుణే & అహ్మదాబాద్‌లలో ఐఫోన్ 17లు 3 నిమిషాల్లోనే చేతికందాయి. ఆపిల్ స్టోర్కెళ్లినా ఇంత ఫాస్ట్‌గా ఫోన్ ఇవ్వరు. ఇంకా, వాలెంటైన్స్ డే రోజున నిమిషానికి 666 గులాబీలు ఆర్డర్ అయ్యాయి. సోమవారం… దేశంలోనే టాప్ గిఫ్టింగ్ డేగా మారింది. రక్షాబంధన్, ఫ్రెండ్‌షిప్ డే, వాలెంటైన్స్ డే రోజులు భారీ బహుమతుల రోజులుగా నిలిచాయి.
మొత్తానికి —
2025లో భారత్ ‘మెరుపువేగం’తో షాపింగ్ చేసింది. అర్ధరాత్రి ఆకలి నుంచి పండుగ ఆడంబరాల వరకూ… ప్రతి కార్ట్ ఒక ‘పది నిమిషాల’ మినీ కథ.
