VIROSH | ఉదయ్‌పుర్‌లో ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’… పెళ్లి తేదీ అఫీషియ‌ల్‌గా ప్రకటించిన విజయ్ – ర‌ష్మిక‌

VIROSH | టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రేమ కథకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి అధికారికంగా స్పందించారు.

VIROSH | టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రేమ కథకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి అధికారికంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మౌనం పాటించిన ఈ జంట తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ వివాహాన్ని ప్రకటిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

పెళ్లి వేడుకకి  ‘విరోష్’ పేరు

విజయ్–రష్మికల జంటను అభిమానులు ఎంతో ప్రేమగా “విరోష్” (ViRash) అని పిలుస్తుంటారు. ఈ పేరే ఇప్పుడు వారి పెళ్లికి అధికారిక నామకరణం అయింది. మేము ఏదైనా అనుకునేలోపే మా ఫ్యాన్స్ అన్నీ చేసేస్తున్నారు. వారు పెట్టిన ‘విరోష్’ అనే పేరు మాకు చాలా నచ్చింది. అందుకే మా పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాం” అంటూ వారు చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి 26న ఉదయ్‌పుర్‌లో వివాహం

ఈ స్టార్ జంట 2026 ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని అందమైన సరస్సుల నగరం ఉద‌య్‌పూర్‌లో పెళ్లి వేడుక జరగనుంది. అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులు మాత్రమే హాజరయ్యేలా ప్రైవేట్ సెరిమనీగా ఈ వివాహం ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఉదయ్‌పుర్‌లోని ప్యాలెస్ వాతావరణంలో సంప్రదాయ హిందూ పద్ధతుల్లో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఏర్పాట్లన్నీ గోప్యంగా జరుగుతున్నాయని, భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా ఉంటాయని తెలిసింది.

మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు ఈ రిసెప్షన్‌కు హాజరవుతారని అంచనా. అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉంది.

రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ వరకు…

విజయ్–రష్మికల జంట మొదటిసారి కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం Geetha Govindam. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత డియ‌ర్ కామ్రేడ్ Dear Comradeలోనూ కలిసి నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆన్‌స్క్రీన్‌లో మొదలైన ఈ బంధం ఇప్పుడు నిజ జీవితంలోనూ కొనసాగుతుండటంతో అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. సోషల్ మీడియాలో #WeddingOfViRash, #ViroshWedding వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

అభిమానుల సంబరాలు

ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త అధికారికంగా రావడంతో సోషల్ మీడియా శుభాకాంక్షలతో నిండిపోయింది. సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

టాలీవుడ్‌లో మరో స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండటంతో 2026 పెళ్లి సీజన్ మరింత స్పెషల్‌గా మారింది. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Latest News