Supreme Court : కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో ఏపీకి ఊరట!

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఏపీకి సుప్రీంకోర్టులో ఊరట. ఏకసభ్య కమిటీపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Tirumala laddu controversy

విధాత : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కల్తీ నెయ్యి వివాదంలో సిట్ నివేదికపై ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసిందని…దానికి అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయడం ఎంతవరకు సబబు అని సుబ్రమణ్య స్వామి పిటిషన్ లో ఏక సభ్య కమిటి ఏర్పాటును ప్రశ్నించారు.

ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేర్చడంతో పాటు చంద్రబాబు, సిట్, టీటీడీని కూడా పిటిషన్ లో చేర్చారు. సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్‌ కిందికి రాదని స్పష్టం చేస్తూ సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి :

V.C Sajjanar : అమ్మాయిలూ.. జాగ్రత్త! : ఏసీపీ సజ్జనార్ హెచ్చరిక !!
TDR Hyderabad Real Estate | త్రిమూర్తుల చేతుల్లో ‘టీడీఆర్’ బందీ!

Latest News