V.C Sajjanar : అమ్మాయిలూ.. జాగ్రత్త! : ఏసీపీ సజ్జనార్ హెచ్చరిక !!
హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో మోసాలు పెరుగుతున్నాయని సీపీ సజ్జనార్ హెచ్చరిక. నిశ్చితార్థం అయినా అప్రమత్తంగా ఉండాలని అమ్మాయిలకు కీలక సూచనలు.
విధాత, హైదరాబాద్ : సైబర్ క్రైమ్.. ఆన్ లైన్ బెట్టింగ్ లు మోసాలు సహా పలు రకాల నేరాల పట్ల ప్రజలను తరుచూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తూ.. జాగ్రత్తలు చెప్పే సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ వీ.సీ. సజ్జనార్ ఈ దఫా అమ్మాయిలకు వార్నింగ్ బెల్స్ వినిపించారు. అమ్మాయిలూ జాగ్రత్త.. పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం! అంటూ ఆయన ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు.
మోసం చేస్తున్న తీరుపై వార్నింగ్
పెళ్లి ముసుగులో మోసగాళ్లు .. ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారని, పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారని, ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒత్తిడితో శారీరకంగా లోబచుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు అని, పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు అని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని వెల్లడించారు.
నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు అని, ఇదే అదనుగా భావిస్తున్న కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు అని, పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని, నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని అమ్మాయిలకు సజ్జనార్ ముందస్తు జాగ్రత్తలు తెలిపారు.
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు అని, అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి అని, పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించండి, ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు అని, వెంటనే పోలీసలుకు ఫిర్యాదు చేయండని సూచించారు.
మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి అని, మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని, ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి అని సూచించారు.
అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!
హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్… pic.twitter.com/Nhy2rmE65o
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 23, 2026
ఇవి కూడా చదవండి :
Nepal bus accident| నదిలో పడిన బస్సు..18మంది మృతి
Chiranjeevi | MSG వేడుకలో మెగాస్టార్‌కు ఘన సన్మానం.. ఇండస్ట్రీ దిగ్గజాల సమక్షంలో చిరు సత్కారం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram