Gold-Silver Rates | పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్న్యూస్. బులియన్ మార్కెట్లో శనివారం వెండి ధర భారీగా తగ్గింది. ఒకే వెండిపై ఒకే రోజు రూ.2వేలు పతనమైంది. మరో వైపు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గి తులానికి రూ.66,500కి దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.210 పతనమై తులానికి రూ.72,550కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,200కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,550కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,700కి పతనమైంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,750 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా తగ్గింది. రూ.2000 తగ్గి రూ.93,500కి చేరింది. హైదరాబాద్లో కిలో రూ.98వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.