విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు, అనర్హత అభియోగాలు ఎదుర్కొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడంపై మండిపడుతూ మాజీ మంత్రి టి.హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ బీఫామ్ పైనే దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశాడు అని,
అయినా పార్టీ మార్పునకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారని లేఖలో గుర్తు చేశాడు. స్పీకర్ తీర్పును మీరు సమర్ధిస్తారా? లేక చర్యలకు ఆదేశిస్తారా? అని హరీశ్ రావు తన లేఖలో రాహుల్ గాంధీని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని నిలదీశారు.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి, తెలంగాణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా నైతికత గురించి మాట్లాడే కాంగ్రెస్, తెలంగాణలో రాజ్యాంగ విలువల పట్ల కపట వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.
Dear @RahulGandhi ji
You travel across the country proclaiming that you are fighting to protect the Constitution. In Parliament, in public meetings, and in political campaigns, you repeatedly claim that safeguarding constitutional values is the central mission of the Congress… pic.twitter.com/AhH3m1PF1T
— Harish Rao Thanneeru (@BRSHarish) March 13, 2026
ఇవి కూడా చదవండి :
Gas Surcharge : బిగ్ షాక్.. హోటల్ బిల్లులో గ్యాస్ సర్ చార్జ్ !
Sunrisers Leeds X Account Suspended | సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !
