ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!

సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండా సమీపంలోని గుట్టపై మనిషి తల ఆకారంలో ఉన్న సహజ శిలాకృతి సందర్శకులను ఆకట్టుకుంటూ అద్భుతంగా నిలిచింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 11, 2026, 2:58 pm IST
Read Time: 2 mins
ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!

ప్రకృతిలోని కొన్ని సహజ శిలాకృతులు ఆసక్తికరమైన రూపాలలో కనిపిస్తుంటాయి. అలాంటిదే ఒకటి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం గూడెపుకుంట తండా దగ్గర గుట్టపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనిషి తల ఆకారంలో ఉన్న ఓ పెద్ద బండరాయి గుట్టపై దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ప్రజలను ఆకర్షిస్తోంది.

భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని మరీ ఠీవిగా నిలబడిన మనిషి తల ఆకృతి శిల.. స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటూ చరిత్రకు మౌన సాక్షిగా నిలిచింది. ఇలాంటి ప్రక‌ృతి చెక్కిన సహజ శిల రూపాలను ప్రభుత్వం పరిరక్షింభి భవిష్యత్ తరాలు కూడా చూసే అవకాశం కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.