Gas Surcharge : బిగ్ షాక్.. హోటల్ బిల్లులో గ్యాస్ సర్ చార్జ్ !
ఎల్పీజీ కొరత ప్రభావంతో హోటళ్ల బిల్లుల్లో ‘గ్యాస్ యూజేజ్ ఫీ’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం వైరల్ అవుతోంది. చెన్నైలో ఓ హోటల్ బిల్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
విధాత : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్దంతో పశ్చిమాసియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ లో ఏర్పడిన ఎల్బీజీ గ్యాస్, చమురు కొరత ఎఫెక్ట్ ప్రజలను అతలాకుతలం చేస్తుంది. వంట గ్యాస్ కొరత సమస్యతో హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు, హాస్టల్స్ లో పరిమిత స్థాయిలో వంటలకే పరిమితమవుతున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతపడగా.. పలు ప్రాంతాల్లో ఛార్జీలను పెంచి నడిపిస్తున్నారు. వంట గ్యాస్ కొనుగోలుకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తుండటంతో హోటల్స్ నిర్వాహకులు ఆ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నారు. ఆహార పదార్ధాల ధరలను పెంచేసి షాక్ ఇస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని.. వినియోగదారులు సహకరించాలని పలు హోటళ్లలో బోర్డులు దర్శనమిస్తున్నాయి.
తాజాగా చైన్నై నగరంలో ఓ హోటల్ బిల్లులో టిఫిన్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ఛార్జీలు వేయడం వైరల్ మారింది. ఒక కస్టమర్ టిఫిన్ చేశాక..హోటల్ నిర్వాహకులు ఇచ్చిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. అందులో టిఫిన్ ధరల కింద ‘Gas Usage Fee’ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేశారు. “మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి, మళ్ళీ వంట గ్యాస్ ఖర్చు విడిగా కట్టాలా?” అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఏదో జీఎస్టీ తరహాలో ఇలా అదనంగా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని?..ఇది నిబంధనలకు విరుద్ధమని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి.
అప్పుడు గల్ప్ సర్ చార్జీలు..ఇప్పుడు గ్యాస్ చార్జీలు !?
అయితే గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ద సమయంలో భారత్ లో గల్ఫ్ సర్ చార్జీలు వసూలు చేశారని..ఇది కూడా అలాంటిదేనంటు హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు సమర్థించుకుంటున్నారు. కాకపోతే గల్ఫ్ సర్ చార్జీలను ప్రభుత్వాలు అధికారికంగా విధించగా..ఇప్పుడు గ్యాస్ చార్జీలను మాత్రం ప్రైవేటుగా వసూలు చేస్తుండటం సమస్యగా తయారైంది. ఇది ఓ రకంగా వినియోగదారులను దోపిడీ చేయడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
టాలీవుడ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలి : అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో రేవంత్
బంగారు నగలు కావాలి : బరువు తక్కువుండాలి – ఇప్పటి ట్రెండ్ ‘గోల్డ్ మినిమలిజం’!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram