దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు !
దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ నోటీసులు! ఈనెల 30న విచారణకు రావాలని ఆదేశం. సుప్రీంకోర్టు హెచ్చరికతో వేగంగా కదులుతున్న ఫిరాయింపుల ఫైళ్లు.
విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ పై విచారణకు ఈనెల 30న ఉదయం 10:30కు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్ పై అనర్హత పిటీషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 30వ తేదీన వారు కూడా విచారణకు రావాలని పేర్కొన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధిండి 7మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే సంజయ్, దానం, కడియం శ్రీహరిల విచారణ పెండింగ్ లో ఉంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎపిసోడ్ లో దానం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఆ పిటిషన్‌ను కొట్టేయండి: స్పీకర్‌కు దానం వినతి
అనర్హత పిటిషన్ కు సంబంధించి ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు . తనపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విన్నవిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం తనకు లేదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Rajgopal Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
Captain Shambhavi Pathak : అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram