Rajgopal Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
మునుగోడు పనుల బిల్లులు మంజూరు కావడం లేదంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విధాత : ఏదో ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాంబు పేలుస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గం కోతులారం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నా మునుగోడు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బిల్లులు మంజూరు చేయడంలేదు అని ఆరోపించారు. దీనిపై గతంలో రేవంత్ రెడ్డిని అడిగితే వారం రోజుల్లో మంజూరు చేస్తా అన్నాడు అని.. మూడు వారాలు గడుస్తున్నా ఇంకా బిల్లులు మంజూరు చేయలేదు అని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
మునుగోడు పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలో ఆపేస్తున్నారు. అని, ఆర్థిక మంత్రి భట్టిని నిలదీసి అడిగితే బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నాడు అని, కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. మునుగోడు అభివృద్ధి పనుల నిధులు, బిల్లుల కోసం ఎదురు చూసి విసిగి పోయానని….ఇలాగే చేస్తే ఊరుకోబోనన్నారు. మరికొన్ని రోజులు వేచి చూస్తానని… ప్రభుత్వం పనితీరు మారకపోతే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తానని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
Captain Shambhavi Pathak : అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్
Upsana | మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్.. ఉపాసన డెలివరీ డేట్ వచ్చేసింది..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram