Upsana | మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్.. ఉపాసన డెలివరీ డేట్ వచ్చేసింది..!
Upsana | ఇటీవల మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక ఈ నెలలో చిరు నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సూపర్ హిట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ ఆనందకర సమయంలో మరో గుడ్ న్యూస్ రాబోతుంది
Upsana | ఇటీవల మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక ఈ నెలలో చిరు నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సూపర్ హిట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ ఆనందకర సమయంలో మరో గుడ్ న్యూస్ రాబోతుంది. ప్రస్తుతం ప్రగ్నెంట్‌గా ఉన్న ఉపాసన జనవరి 31న కవలలకి జన్మనివ్వబోతుందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఉపాసన డెలివరీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
మెగా ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ కోసం గత ఏడాది దీపావళి చాలా ప్రత్యేకంగా మారింది. స్టార్ యాక్టర్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు రెండో సారి తల్లిదండ్రులుగా మారబోతున్న విషయాన్ని ఆ రోజు రివీల్ చేశారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఉపాసన తల్లి శోభన కామినేని అధికారికంగా ధృవీకరించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా, “దీపావళి డబుల్ ధమాకాగా వచ్చింది. వచ్చే ఏడాది ఉపాసన-రామ్ చరణ్‌కు ట్విన్స్ పిల్లలకు వెల్‌కమ్ చెబుతాము. త్వరలోనే మా కుటుంబంలో అయిదుగురు గ్రాండ్‌చిల్డ్రన్ ఉండబోతున్నారని ఆలోచించటం నా ఆనందాన్ని రెట్టింపుచేసింది” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చాలా వైరల్ అయింది.
ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
ఉపాసన అక్టోబర్ 24, 2026న హైదరాబాద్‌లో జరిగిన తన బేబీ షవర్ (సీమంతం) వేడుకకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని ఆమెకు ఆశీర్వాదాలు అందిస్తూ, ఆనందంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలో నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తో పాటు సినీ స్టార్‌లు నయనతార, వెంకటేష్, నాగార్జున కూడా ఉన్నారు. వీడియో చివర రెండు పాదముద్రలతో ముగుస్తుంది, ఇది ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు సంకేతం అని భావించారు.
ఉపాసన వీడియోకు క్యాప్షన్‌లో “ఈ దీపావళి రెట్టింపు వేడుకలు, రెట్టింపు ప్రేమ, రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది” అని రాశారు.. దాంతో వారికి ట్విన్స్ పుట్టబోతున్నారని ఫిక్స్ అయ్యారు. కాగా, రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి 2023లో మొదటి సంతానంగా క్లీంకారా పుట్టింది. ఇప్పుడు, ట్విన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ క్రేజీ కపుల్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram