Uttam Kumar Reddy| ప్రాజెక్టుల భూ సేకరణకు రూ.5 వేల కోట్లు : మంత్రి ఉత్తమ్
తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ. 5వేలు కోట్ల నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం జలసౌధలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు.
విధాత : తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ. 5వేలు కోట్ల నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం జలసౌధలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చయినా సరే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని, వచ్చే రెండేళ్లలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు. తెలంగాణ లో సీఎం రేవంత్ నాయకత్వం లో కృష్ణ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లా లకు అందిస్తాం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధిక వరి సాగు ఈ ఖరీఫ్ పంట లో వచ్చింది అని, కృష్ణా, గోదావరి బేసిన్ లలో అత్యధిక సాగు పంటలు పండాయని గుర్తు చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులు 2014 జూన్ 2న ఎలా ఉన్నాయో 2024 జూన్ 2న కూడా అలాగే ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదన్నారు. పాలమూరును 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. 55 వేల కోట్ల ప్రాజెక్టులో 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్లా? అని ప్రశ్నించారు. వారి హయాంలో నే పాలమూరు అంచనాలు 84 వేల కోట్ల కు పెంచారు అని, 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు అని పునరుద్ఘాటించారు. పాలమూరు ప్రాజెక్టు ను జూరాల నుంచి శ్రీశైలం కు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది అని, కాళేశ్వరంలో చేసిన పొరపాటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేశారు అని విమర్శించారు. 2028 డిసెంబర్ లోపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం అని, నిధులను గ్రీన్ ఛానల్ లో విడుదల చేసి పనులు పూర్తి చేస్తాం అని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram